పుట:కాశీమజిలీకథలు-12.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహానందుని కథ

275

నని లోలోనఁ గ్రుళ్ళుచుండిరి. ఒరులకీ సంగతి జెప్పుకొన్న నగుబాటులగునని దొంగను తేలుకుట్టినట్లు గిక్కురుమనకుండిరి.

350 వ మజిలీ

మహానందుఁ డట్లర్దరాత్రంబున ప్రియంవదా సమేతముగా బెక్కుదూరము నడచిపోవుచుండ మార్గమధ్యమందు గొందరు పాటచ్చరు లెదురుపడి వారియొద్ద గల ధనమెల్ల గొల్ల గొట్టుకొనిపోయిరి.


గీ. అట్లు విత్తమెల్ల నపహరింపగ వా
    రప్పు డేమిసేయునదియులేక
    జీవతావశేషులై విచారంబులఁ
    దెల్ల వార నొక్కపల్లె జేరి.

మఱియు వారందుండి గ్రమంబున పూర్వపుణ్యవిశేషంబున గాశీపట్టణంబు జేరికొనియెను. అది నిగూఢనివాసంబున కుచితప్రదేశమని యందు స్థిరనివాస మేర్పరచుకొని మహానందుఁడు ప్రియంవదతోఁ గాపురము జేయుచుండెను.


సీ. శైవుఁడై కొన్నాళ్ళు సంచారమొనరించు
             గ్రుమ్మరు స్మార్తుఁడై కొన్నినాళ్ళు
    వైష్ణవుండై కొన్నివారము ల్దరియించు
             గొన్నాళ్ళు ద్వైతంబు గూర్చి తిరుగుఁ
    గొన్నినాళ్ళెరిగి కైకొను బౌద్దమతము
             గీర్తించుఁ కొన్నినాళ్ళు శాక్తేయమతము
    గాపాలికంబు చక్కనిదను గొన్నాళ్ళు
             వాదించు గొంతచార్వాకమతము.

గీ. తత్తదను కూలము వేషముల్దాచ్చి యాతఁ
    డెందు మిక్కిలి ధనలాభమెసగ మెసఁగు
    నదియె శ్రేష్టతమంబని యఖిలసభల
    వాధమొనరించు సత్యనిస్వమతి యగుచు.

ఇట్లు ధనమార్జనాకాంక్షుడై యనేక వేషంబులు వేయచు భాగీరధీతీరంబున యాత్రాపరులవలన.


ఉ. ఆరని సాటివారు పరి ◆ హసముచేయుదురంచు నెంచగా
    నేరక పర్వకాలముల ◆ నీ చవు పుల్కసుఁడైన నిచ్చినన్‌
    సైరిభ సౌరభేయతిల ◆ సైంధవతల్పము ఖోగ్రదానము
    ల్సారమతిన్‌ గ్రహించు ధన ◆ సంగ్రహ తత్పరుఁడై యతండిలన్‌.