పుట:కాశీమజిలీకథలు-12.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

274

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

బుట్టకున్నది. ఆపని నీవె స్వయముగ నెరవేర్చుటకు నిన్ను మిక్కిలి ప్రార్ధించు చుంటిమి. ఇందులకు నీవొడంబడవలయునని నిర్భంధించుటయు నతండోహో ! ఇది మిక్కిలి వింతగా నున్నది. నీ తలమీద నేదియో నున్నదన నీ చేతితోనే తీసివేయమని నట్లున్నది. అక్కార్యమువలనే లభ్యమగు బంగారముఁ బుచ్చుకొనువారు మీరును నందులఁ గలుగు కలుషం బనుభవించువాఁడను నేనునా ? లాభముగోరువారు కష్టముల భరింపవలెనేగాని నాకు నిమిత్తమురాదని బలుకుటయును వారిట్లనిరి. ఓయీ ! అందలి లాభము మాకు మాత్రమే జెందునని నీ వాత్రపడనక్కరలేదు. నీకుఁగూడ గొంత భాగ మిచ్చుటకు సంసిద్దులమై యుంటిమని జెప్పుటయు నతండు మిమ్మెవరు నమ్మ గలరు ! ఇందులకుఁ గావలసిన పెట్టుబడియంతయును మాదియే యగుట మేము నలుసంత బంగారమైన యీయమని మీరు తగవుపెట్టిన నేనేమి చేయఁగలసు. మీరీయ నెంచిన దేదియో ముందుగ నాకు ముట్టజెప్పవలయునని జెప్పి యందులకొక వేయి నిష్కములఁ గోరెను.

ఆ మొత్తమునుకూడ వాని కిచ్చుటకు వా రంగీకరించి యధాకాలమున కెట్టులో యనుకొన్న రొక్కము వానికిచ్చి యా యుద్యోగి పరిచారకునందు పని యున్నది రమ్మనమని వెంటదీసికొనివచ్చి వీధితలుపులు బిగించిరి. వారిచ్చినవిత్తము మూటలోనఁ బదిలపరచి మహానందుఁడు మహాసాహసముతోఁ జంద్రహాసమునుబూని యా పరిచారకుఁ డేమరిపాటుననున్న తరుణంబున వానికుత్తుక నుత్తరించివైచెను. ఆ మృతకళేబరమునుండి గావలసిన యవయవములఁదీసి కపాలమునందెద్దియో రసము బోసి నిలువులోతున భూమిలో పాతిబెట్టించెను. తక్కిన గాత్రభాగంబులను వేఱొక చోట పూడ్పించివైచెను. పదిదినంబులిట్లు భూపుటంబున నుంచి పిమ్మటఁ బైకిఁదీసి యా కపాలములోనున్న ద్రవపదార్థంబెల్ల నెన్నిమణుగుల బంగారము గావలెనో యన్నిమణుగుల తైలంబునగలిపి. దానితో వలయును. అట్టుేసినపిమ్మ ౧ట సొకదినము యును మేలిమిట్‌ంగా! రముగో మోర్తునని (టవ్‌యు బాలీత+ జెప్పి ఆ ర్మాతి యిక స్‌:ళ మోసమువలనం దాను సంపాటింస ధనిమంతయు. మూటగిట్ర యిపలజుంగకుండ ౮ వారిరువురును బలాయతులెరి. సొప.ఎప ఓ

దొగియంచదుగదా?! ఆ ఆ ఘాతుక చెట్టులో టూ రాజభటులఎ మని గ