పుట:కాశీమజిలీకథలు-12.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

మహానందుని కథ

271

నోటనుండి యీ మహాయోగ విషయము వెల్వడినది. మీరింత బలవంతముజేయుదురని తెలిసిన నిక్కము నీసంగతిఁ దెలియఁజేసి యుండను. అంతవఱకు ప్రమాదమున నైన నెవ్వరిసన్నిధిని నియ్యుదంతంబు వెలిబుచ్చకుండ నతిజాగరూకతతోఁ గాలక్షేపము జేసికొనివచ్చితిని. దైవికముగా నిప్పుడు మీకుఁ దెలియఁజేయుటఁ జూడనిది దైవసంక ల్పమై యుండవచ్చును. దైవమునుమీఱు వారెవ్వరును లేరుకదా! ఈ విధంబున మీకు ధనయోగ మున్నది కాబోలును! మంచిది మీకునిక్కముగా నీ యోగము నాచేత జేయింపూన్కెఁ గలిగియుండిన నేఁ జెప్పినట్లు చేయుచుండుఁడు. స్వర్ణదేవతాయాగ సామగ్రికొనుటకు వేయినిష్కములు గావలయును. ఈ ధనము ముందుగ సమకూర్చు కొని వచ్చినపిదపఁదక్కి.న పద్ధతులన్నియు దెలియఁజేసెదనని పలుకుటయు వారుఁ గులుకుచు బోయి తమ యాస్తులతాకట్టుబెట్టి మఱిరెండు దివసంబుల కామొత్తమును మహానందుని యెదుటఁ బెట్టిరి. ఆ సొమ్మంతయు మూటకట్టుకొని మందస్మిత సుందర వదనారవిందుడై మహానందుఁడు వారితో అబ్బా! మీ పూన్కెను గొనియాడవచ్చును. మీకుఁ గావలసినంత బంగారపుముద్ద జేసియిచ్చెదను. యీధనముతో గావలసిన సాధన సామగ్రినంతయు నేడే సమకూర్చుకొందును. స్వర్ణదేవతాయజ్ఞమన్న మాటలలోనిది కాదు. దీక్షగా నొకపక్షముదివసములాచరింపవలెను. ఇంతకష్టపడుచున్న నాకు యజ్ఞ దక్షిణతక్కువయుండరాదు. మిత్రులనుండి యెక్కువఁబుచ్చుకొనుట యుచితమైనపని గాదని నేనెరుంగుదును. కావున నింకొక వేయినిష్కములు మాత్రము నాకు దక్షిణగా మీరు ముందు సమర్పింపవలయుననుటయు వాండ్రించుక సంశయించుచు మిత్రమా! యీమాట మొదటనే చెప్పరాదా! అప్పుడే యేకముగా నెచ్చటనో తంటాలుపడి తేకుం దుమా ! మాయాస్తులఁ దాకట్టుపై రెండువేల నిష్కంబులు కావలెనని మొదటనే ఋణ దాతలఁ గోరియుందుము గదా ! వెండియు మఱొక్క వేయిగావలయునన్న వారేమం దురో దెలియదు. అయినను సాధ్యమైనంత తొందరగా నీవన్న మొత్తముఁగూడ సిద్ధ పఱచెదము. సత్వరమ యాగదీక్షకుఁబూని మమ్ముఁగృతకృత్యులం జేయుమని తొందర పెట్టుటయు నాకపటియిట్లనియె మిత్రులారా ! తిష్ట కుదిరినగాని నిష్టకుదరదు నార్యోక్తి మీరెఱుంగనిదికాదు. యజ్ఞదక్షిణ విషయము యుచితజ్ఞులగుమీకు నేను మొదటనే జెప్ప వలసియుండునని యనుకొనలేదు. లేకున్న నప్పుడే జెప్పియుందును. ఊరక కంచి గరుడ సేవయనుసామెత వడువున వృధాయాసపడవలయునని మీ రూహింతురని నేను దలంపనై తి ననుటయు వారింతకు వచ్చినపిదప మిన్నకుందుమా ! రేపటికామొత్తము గూడ నెట్లొతెచ్చి మీ‌కర్పింప గలమనిపలికి యావలకుంబోయిరి. మఱునా డాబాలిశులు

"యించి చ ననర్దన యోగమున లఖించిన దానిలో న్‌న్ని: చంటిని = నొత ప్రభం పం నొరవపంతు త్‌ పయినిష్కములు చట పపదసములనణకు తాను చ్రముగాశంచ నుండుటకు