పుట:కాశీమజిలీకథలు-12.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మూలఁగన్నమువైచి లోనఁబ్రవేశించి కొంతధనము సంపాదించుకొని వచ్చి వేగుజాము కాకమున్న యామచ్చెకంటిదోడ్కొని‌ యాపురంబు విడిచి దూరమందున్న రాజదుర్గం బను మఱొకనగరము ప్రవేశించెను. మఱియు వారు మార్గమధ్యమందె బైరాగివేష ములు దీసిపారవైచి పూర్వపు వేషములధరించియుండిరి. వారాపట్టణంబున నొకసత్ర ములో బసజేసిరి. చౌర్యముమూలమున సంపాదించిన ధనముండటంజేసి కొంతకాలము స్వేచ్చగాభుజించిరి. ఆయూరిలోవారు గొంతకాలము గౌరవ వేషములతో భార్యయు భర్తయువలెఁ గాపురము చేసిరి. మహానందు డందుగల కితవులుగొందఱితో మైత్రిఁ జేసెను. అతఁడక్షక్రీడయం దారితేఱిన వాఁడగుటంజేసి దానివలన గెలుపొందిన ధన ముతోఁ గొంతకాలము కాలక్షేపము జేసెను.

349 వ మజిలీ

ఒకనాఁడు మహానందుఁడు మిత్రులతో జ్యూతక్రీడాభిరతుండై యున్న సమయంబునఁ బ్రసంగవశంబున డాంబికముగా స్వర్ణయోగం బెరుంగుదునని చెప్పు టయు నాకితవులలోకొంద రెట్లయిన వానినుండి యాయోగము నెఱింగి భాగ్యము సంపాదింపవలెనను నాశగలుగుటచే దరుచు మహానందు నాశ్రయించి తిరుగుచుందురు. ఇట్లుండ వేఱొకనాఁడు వారినిర్భంధముఁబడ జాలక యీ యోగముచేయుటకు ముందు కొంతధన మవసరము. కొన్ని యమూల్యవస్తువుల సంగ్రహించి పిమ్మట స్వర్ణాధి దేవతకుఁ బ్రీతిగా నొకమహాయజ్ఞముఁజేసి యా యజ్ఞకుండ మందలిభస్మముతో స్వర్ణము సృజింపవలయును. పిమ్మటఁగూడ గొన్ని దుష్కరక్రియలాచరింపవలయును. స్వర్ణయోగమన్న మాటతోనున్న దనుకొనుచుంటిరాయేమి? ఈ మహాయోగ మొక మహాయోగీంద్రుని బెద్దకాలమాశ్రయించి సంపాదింపఁగలిగితిని. అట్టిదానిని మీరడిగి నంత తెలియఁజేయుటకు నేనులోకజ్ఞానమెరుంగని మూఢుండననుకొంటిరా ? అందని మ్రానిపండ్లకై యఱ్ఱులుసాఁచుటకుఁ బూనుకొనక యున్న దానితో తృప్తి బొందుఁడు ! పొండు అని వారినదలించెను.

వారును తమ మిత్రునకు నిక్కముగ బంగారు యోగము దెలియునని నమ్మి దురాశాపిశాచము హృదయంబున వేధించుచుండ నా మహానందు నతివినయంబునఁ బ్రార్దించుచు మిత్రమా ! మాకాయోగము దెలుపనక్కఱలేదు వేయిమణుగుల బంగారము జేసి నీవే మాకిమ్ము. దానితోఁ దృప్తినొందెదము. ఇందులకెంతధనము గావలయునో? యేమిచేయవలెనో ? జెప్పిమమ్మనుగ్రహింపుము. ప్రాణస్నేహితులమగు మాదారి ద్ర్యముఁ బాపుమని దీనానులై బ్రతిమాలుకొనుచున్న యక్కితవుల కా ధూర్తాగ్రేసరుం డిట్లనియె.

మిత్రులారా! మీమాటలకు నేను మొగమాటము జెందవలసి వచ్చుచున్నది. మీ కోరికత్రోసివేయజాలకున్నాను. ఏదియో మాటలసందడిని పొరబాటున నాఁడు నా