పుట:కాశీమజిలీకథలు-12.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహానందుని కథ

269

యించి నావలన తత్వోపదేశంబును బడసి నన్ననుసరించి తిరుగుచున్నది. నీవు కడు యోగ్యుడవువలె గన్పట్టుచున్నావు. నీ భక్తివిశ్వాసముల కెంతయు సంతసించితిమి. మేము పుణ్యహృదయుఁడవగు నీ కుటీరమున నించుక విశ్రమింపనేతెంచితిమి. నీవు కిరాతజాతియందు జన్మించినవాఁడనుటచే నీయింట భిక్షసేయరాదు. అయిననేమి నీ యింటియావరణలో నీవిచ్చు పదార్థములతో స్వయంపాకముచేసికొని బిక్షగుడుచుట కంగీకరించితిమి అందువలన యతిభిక్షాఫలము నీకు తప్పక సిద్దింపఁగలదని పలుకు టయు నా యమాయకుండుప్పొంగుచు నప్పుడే వలయు వస్తుసంచయంబెల్ల తెచ్చి వారి ముందు భక్తితోఁబెట్టెను. అక్కుహనాయతినారాయణస్మరణపూర్వకంబుగా నా పదార్థ ముల నెల్లగ్రహించి యందొక వివిక్తప్రదేశంబున శిష్యురాలిచే వంటచేయించి యందిరు వురు తృప్తిగా భుజియించిరి. ప్రియంవదయు నలసటం బొందియుండుటచే నందొ కచోఁ బరుండి గాఢనిద్రాముద్రితయైయుండెను. మహానందుని నాకోయదొర మహా యోగియని నమ్మి యతని సన్నిధికేతెంచి యనేకవిధముల నతని స్తుతించుచుఁ దన యింటనింకను గొన్నిదినంబు లుండ డనిప్రార్థించెను. కాని యాతండందుల కంగీక రింపలేదు. ఈరాత్రి నీయింటఁగడిపి యుదయముగాక మున్నుబయలుదేరి పోవలయు నని‌ చెప్పితిరుగ నా రాత్రి భుక్తికి గావలసిన పదార్థముల వాని నిమ్మని కోరెను.

వాఁడును మహాసంతోషంబునఁ గావలసిన పదార్ధములకన్న మిన్నగాఁ దెచ్చి యొసంగెను. నాఁటిరాత్రిఁగూడ యా కోయపల్లె యందే గమనశ్రమవాయుటకుఁ గడపి వారిచ్చిన పదార్థములలో మిగిలినవెల్ల మూటగట్టుకొనివారు వేకువజామున లేచి యెందేనియుం బోయిరి. కోయదొరయిచ్చిన సామాగ్రి మూఁడుదినములవఱకు సరి పోవుటవలన నొరులప్రేక్ష్యములేకుండ నరణ్యమార్గంబున వారు పయనంబుల సాఁగిం చిరి. నాల్గవదినంబున తిరుగ బిక్షకై యెద్దియేని జనపదంబులకుఁ జేరవలయునుగదా ! అని వడీవడినడుచుచు నాఁడు పగలు రెండుయామములవేళకు రామనగరమను పట్ట ణముఁ జేరగలిగిరి.

ఆఁకటి చిచ్చు పెచ్చు పెఱిగి కడుపుదహించుచుండ నతికష్టమున కాళ్ళీడ్చు కొనుచు నాపట్టణమున నొకసత్రములోనికిఁ బోయిరి. అందొక పుణ్యాత్ముండు బిచ్చ గాండ్రకెల్ల సంతర్పణ మొనరించుచుండెను. ఎట్లయినను నాకలియడంచుకొనుట మేలని యా బిచ్చగాండ్రతోఁ గలసి యొకమూలఁ గూర్చుండి వారిరువురు గడుపుమంటఁ జల్లార్చుకొనిరి.

పిమ్మట నాయూరుంగల బైరాగుల మఠములోనికిం బోయి యందు నివసిం చిరి. ఎండకన్నెఱుంగకుండ సుఖముగా నింటికడనుండి కాపురము చేయుటకన్న యాచెడి పెకు మారుమగనితో తినరానితిండి దినుచు పడరానిపాట్లుఁబడుచునుండుట సంతోషముగానున్నది. మహానందుఁడా రాత్రిరెండుజాములు దాఁటినపిదపలేచి యంతకుపూర్వము గురుతుచూచుకొనియున్న యొకసంపన్న గృహస్తునింటికి మారు