పుట:కాశీమజిలీకథలు-12.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మందస్మితంబున బ్రాణేశ్వరీ ! నిజముగా నీతల్లికిఁ బ్రాణముమీఁదకు వచ్చినదనుకొను చుంటివా ? అదియంతయు నాచే గల్పింపఁబడిన పన్నాగము. ఆ యుత్తరము నేను వ్రాయించి మీవారికిఁబంపితిని. మీయమ్మ కేమియు జబ్బులేదు. ఇంటసుఖముగా నున్న దని పలుకుటయు నావెలంది నివ్వెఱఁబడుచు నెంతమోసము పన్నితివి ? నేనైన నీకప టము గ్రహింపలేక పోయితిని. సర్వము నీవేయని నమ్మియున్న నాకు మాయమ్మ విచారము కూడఁదలంపనక్కఱలేదు. నన్ను నీయిష్టమువచ్చినచోఁటికి దీసికొనిపొమ్మని పలుకుచు నప్పుడే యోగినీవేషము వైచుకొని యాకోక స్తని వెంటరా నా యరణ్యమును బట్టి వడివడిగా నడచిపోయెను.


గీ. మగనిఁ జంపి కొంపమాపి బంధువులను
    సిగ్గుపుచ్చి తల్లికెగ్గు వెట్టి
    జనకు దూరఁటీవి జారుతోఁ జనె లేమ
    యేమి సేయనోప రింతుకలట !

ఉ. ఆ పెనుచీకటింబడి రయంబునఁ బోయెడువేళ వానితో
    నామె హితాను లాపముల నాడెడుగాని మహో్గ్రమార్గయా
    త్రాపృధు భేదమింత యహితంబని పల్కదు దర్పకాస్త్రసం
    తాపితచిత్త లెన్నఁడును దక్కినబాధల నెన్నరాత్మలన్‌.

అట్లు వారు పయనము సాగించి యుదయము జాముప్రొద్దెక్కువఱకొక కోయపల్లెఁజేర నరిగిరి. అచ్చట డామహానందుఁ డందున్న యూరిపెద్ద యిల్లడిగి తెలిసి కొని యచ్చటికింబోయెను. ఆ కోయపెద్ద వీరనాయకుండను వాఁడు వారింజూచి భక్తి దాత్పర్యంబున గౌరవించుచు నందొకజుట్టిగుడిసెయందు వారికి బసయేర్పరచి చేతులు జోడించి నమస్కరించుచు మనోనందునితో నిట్లనియె.

మహాత్మా ! మీరెవ్వరో మహాయోగులవలె నున్నారు. మా పూర్వపుణ్యము మంచిదగుటచేత నేడిందు మమ్ము ధన్యులంజేయ నేతెంచితిరి. ఇప్పుడు మీరెందుండి యెచ్చటికిఁ బోవుచున్నారు ? మీవృత్తాంతము సాంతముగా జెప్పి యనుగ్రహింపరే ! యనుటయు నతం డిట్లనియెను.

పెద్దా ! నీయిద్దిక గుణంబున కేమెంతయు నంతసించితిమి సర్వసంగ పరిత్యాగులమగు మాకొక నియామకములేదు సర్వ ప్రపంచకమును మా నివాసస్థాన మని జెప్పునొప్పు ! ఇప్పుడు మేము రామేశ్వరమునుంచి వారణాసికి గంగాపుష్కర దీర్దయాత్రకు బోవుచుంటిమి. పాపపంకిలములగు జనపదంబులఁ జొరనొల్లక ప్రకృతి రామణీయకంబుగ బరమేశ్వరుని స్వరూపము స్వభావంబులఁ బ్రవరించు నరణ్యమార్గం బులం బట్టి పోవుచు నేఁటికిచ్చోటికి వచ్చితిమి. ఈ యోగిని మా శిష్యురాలు బాల్యంబు ననే పూర్వభవపుణ్యాతిరేకంబున విరక్తయై యనన్యజ భక్త్యుద్రేకంబున నన్నాశ్ర