పుట:కాశీమజిలీకథలు-12.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహానందుని కథ

267

యామడల దూరముననున్నది. మార్గమంత సరియైనదికాదు. నడుమదట్టమైన యరణ్య ప్రదేశములు దాఁటవలసియున్నవి. మార్గమున భయము లేకుండుట కిరువురు పరిచార కులఁ దోడుగాదీసికొనిపోయిరి. మహానందు డీయుదంతంబెరింగి తగిన సన్నాహముతో వారెఱుంగకుండ వారివెంట బయలుదేరిపోయెను. బండిమీఁద ముందు శకటచోదకుం డును లోపల భార్యాభర్తలును గూర్చినియుండిరి. పరిచారకులు వెనుక నడచుచుండిరి. వారట్లు చాల రాత్రివఱకు పయనము సాగించిరి.

పిమ్మట బండిలోనివారు గాఢముగ నిద్రావశులై యొడలెఱుంగకుండిరి. బండికిఁ గట్టినయెడ్ల నదలించు రులేక గడియకొకయడుగువైచుచు నడువఁదొడంగినవి. వెనుకవచ్చు సేవకులు నిదురమైకమున జోగుచు నడచుచుండిరి. అట్టిసమయమున నాకసము మేఘావృతమై యుండుటచేఁ జుక్కలఁవెలుగైన లేకుండ నంధకారబంధురమై యొప్పెను. పరిచారకులలో నొకఁడు వెనుకయై నడచుచుండ వెనుకనుండి హఠాత్తుగా వానిమెడమీఁద వాడియైన యడిదపు వ్రేటుపడి తలను దేహమునుండి వేరుచేసినది. ఆ సమయంబున వాఁడువేసిన చావుకేకవిని రెండవవాడు వెనుకకుఁదిరిగి భద్రా ! జడుసు కొంటివా యేమి ? చీఁకటిలో వెనుకఁబడితివేమి ? అని వెనుకకుదిరిగి వానికొరకు వెదకుచుండగా వెనుకనుండి చండగతి నిసితాసియొండు వానిమెడపై గూడబడి కుత్తుక నుత్తరించెను. ఉత్తరక్షణమున నొకవ్యక్తి బండిప్రక్క బిరబిర నడచివచ్చెను. అప్పటి కిని‌ బండిలోనివారు గాఢనిద్రా ముద్రుతులై యుండిరి. బండిముందుతొట్టెలో నిద్రించు నాబండివాని నావ్యక్తికత్తియెత్తి యొక్కవ్రేటున నఱకివైచెను. ఆ సందడికిబండిలో నిద్రబోవుచున్న దంపతులకు మెలకువ వచ్చినది. ఆ బండినుండి పురుషుఁడు దిగి యదియేమియోయని యటునిటు చూచుచుండ సమీపముననున్న యాఘాతకుఁ డాపురు షునిపైబడి యౌదలంబట్టి వంచుచు దుష్టుఁడా ! నీయాలినావేశించిన పిశాచముగా నన్నె ఱుంగమని చేత గౌక్షేయక ధార వానిమెడ నుత్తరించి వెంటనే బండిముందునకేగి దానికిగట్టఁబడియున్న ఎడ్లనువిప్పివేసి యందొకమూలభీతచేతస్కయై నక్కియున్న నామదవతిసన్నిధికేగి యబలా ! భయంపడకుము ! నేను నీకు శత్రుండనుగాను మహా నందుడను సత్వరమ బండిదిగిరమ్ముమన యానందమున కభ్యంతరమగు నీమగఁడు గతించెను. పరివారమును శూన్యమయ్యెను. మనమిక నిర్భయముగా నెందేనయుం బోవుదము రమ్ము. అని పిలుచుచుండగనే యామె నివ్వెఱపాటుతో బండిదిగి యా పురుషుని గౌఁగిలించుకొన్నది. మహానందుడపరిమితానందంబున నామెతో నిట్లనియె. నాతీ ! మన మీవేషములతో నెచ్చటికేగిన ననుమానింతురు. మనము గమ్యస్థానము చేరువర కీకాషాయాంబరముల ధరించి విరక్తులవలె మెలంగవలయునని పలుకుచుఁ దన వెంట దెచ్చిన జేగురుగుడ్డ లాపైదలి కిచ్చెను.

ఆ మాటలు విని యాప్రోయాలు ప్రియా ! మాతల్లి వచ్చుప్రాణము బోవు ప్రాణములమీద నున్నదఁట యామెను జూడవలదా ! అనుటయు నా మహానందుఁడు