పుట:కాశీమజిలీకథలు-12.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

266

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

గొన్ని మంత్రతంత్రములు బైవారికి దెలియునట్లొనర్చుచుఁ బంచరంగులఁ మ్రుగ్గులు వెట్టి యిష్టదేవతారాధనము సేయుచున్నట్లు నటించి యచ్చటివారెల్ల దూరముగాఁ బోయిన సవగ్రహించి మించిన తమకంబు నిష్టోపభోగంబుల నాయింతికిఁ సంతుష్టిఁ గలుగఁజేసెను.

పిమ్మటఁ బ్రతిదిన మిట్లే నాయంగనామణిం గవియుచు నింటివారికి నమ్మ కము బుట్టునట్లు నటించుచు మహానంద మనుభవించుచుండ యొకనాఁ డాముద్దుగుమ్మ యావిటునితో నిట్లని‌యె.

మనోహరా! కపటమార్గమున నెన్నినాళ్ళు సుఖపడఁగలము ? మనగుట్టెట్టు లైన బట్టబయలైనచో నెంతప్రమాదము సంభవించఁగలదు!: లోకమెఱుంగకుండ‌ నీ బందిగంబున నెన్నినాళ్ళిట్లుండగలను. మన స్వేచ్చకుఁదగిన యుపాయమేదైన యాలో చించి నన్నుద్ధరింపుము. నే నెటులైన నీదాననే కదా ? నిన్నెడబాసిన నాకు బ్రతుకు నాశ యెక్కడీది ? నాకు పెండ్లిమగఁడువద్దు ! నిన్ను మనఃపూర్వకముగా బ్రేమించు చున్నాను. నీవే నాభర్తవు. నీవెక్కడనున్న నక్కడ నుండుటయే నా యభిమతంబు. నన్నెందేని దీసికొనిపొమ్ము. నిన్ను విడిచియుండఁజాలనని దీనతతోఁ బలుకుటయు, మహానందుఁడు మహానందమున దేశాంతరమునకు వచ్చుట కిచ్చగింతువా ? అని యడి గిన నప్పడఁతి యందులకు సమ్మతించినది. నాఁడు మొదలా మదవతి నిల్లు వెడలించు నుపాయ మఱయుచుండెను.

పిదప నాయిల్లాలి భూతభాధ కొన్నిదినంబులకుఁ బూర్తిగా తగ్గిపోయినది. ఇఁక మంత్రతంత్రములతోఁ బనిలేదు. భూతోచ్చాటనము జేయఁబడినదని మహా నందుఁడు ప్రగల్భములు చెప్పఁదొడంగెను. వాని భూతవర్ణమును వినినవారెల్లరును వేనోళ్ళ బొగడఁదొడంగిరి. ఆ యింటివారెల్లరును వానిని తమపాలింటిదైవముగాఁ బ్రశంసింపసాగిరి

ఆ యింటికోడలిక యేకాంతవాసక్లేశము దప్పిబోయినది. ఆమె నెప్పటివలె గృహకృత్యములలో కాపాదఁదొడంగిరి. మహానందుఁడు పూర్వపురీతి మిత్రసందర్శన మునకు వారింటికి వచ్చుచుబోవుచుండెను.

348 వ మజిలీ

మహానందుని కథ

అంతట గొన్నిదినంబులకు ప్రియంవదతల్లికి చాలజబ్బుగా నున్నదనియు గూఁతునల్లునిఁ జూడవలయు నను నపేక్షపై జీవించియున్నదనియు వెంటనే రాని యెడల చూపులుదొరకుట దుర్ఘటమనియు వర్తమానము వచ్చుటయు నందులకెల్లరును విచారమును