పుట:కాశీమజిలీకథలు-12.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ప్రియంవద కథ

263

మాయకుఁ డులికిపడి లోనికి పరువెత్తుకొనిపోయెను. మహానందుఁడును నేను గలుగ వెఱువనేల భూతప్రేతపిశాచ బ్రహ్మరాక్షసాది గణంబుఁలెల్ల నాపేరు వినినంతమాత్ర మునఁ బటాపంచలు గావలసినదే ! నా గురువర్యుని కటాక్షమువలన నేనెట్టి గట్టిడి భూతమునైన పాఱఁదోలఁగలను. మోహన స్తంభనోచ్చాటన మారణక్రియలయందు నేనాఱితేఱిన వాఁడను. భయపడకుఁడని పలుకుచు వారివెంట లోనికరిగెను.

మహానందు నందున్నవారెల్ల భూతవైద్యుండని నమ్మియామె కావేసించి యున్న గ్రహంబును బాఱదోలి యాయుపద్రవంబుడపుమని ప్రార్థించుచు వానిని సత్వరమ యంతర్గృహంబునకుఁ దోడ్కొనిపోయి యాయబలం జూపించిరి.

మిత్రుని యిల్లాలిబాధించు గ్రహబాధ దీర్ప నన్నింత యడుగ వలెనా? అనిపలుకుచుమహానందుడులోనఁ బ్రవేశించువఱ కాచకోరాక్షిమేనంగల యాభరణంబు లన్నియు నూడఁదీసియిటునటు పాఱఁజిమ్ముచు నోటవచించరాని దుర్భాషలఁ గనం బడిన వారిం దిట్టుచుచేతికందినవస్తు వెత్తిసన్నిధింజేర బోవువారిని గొట్టుచునతిభయం కరాకారంబున నిల్లె ల్ల గగ్గోలుచేయుచుండెను. "నీవెవ్వతవు? ఈరాజేందుముఖీ నేమిటికి బాధించెదవు? నీకెద్ధియైన గోరికయున్నఁ జెప్పిమాచేఁ దీర్పించుకొనుము” అని దూరము నుండియే యాయింటఁగలవారు పలుకుచుండిరి. గాని యొక్కఁడును యామెయొద్దకుఁ బోవ సాహసించువారు లేకుండిరి.

ఆయబలయు హుమ్మని యౌడుగఱచుచు నన్ను మీరు మరచి పోయితిరా ! మీకింతకండకావరమా ! రెండేండ్లనుండి తిండిలేక మలమల మాడిపోవుచున్నానే ! చచ్చిన వాఁడునోటమన్ను గొట్టుకొని వాఁడేపో యెననినన్నిట్లుపేక్షించెదరా! ఒక్కనాడై నను నా యాకలి తీరునట్లు గడ్డగట్టిన బఱ్ఱెపెరుగుతో నాపేరుజెప్పి యెవ్వనికైనభోజనము పెట్టిన పాపమునకుఁబోయినారా ! నేతితోఁ జేసిన యప్పములన్న నాకెంతప్రీతియో మీరెరుంగరా ! అట్టివికడుపునిండనాకెన్నడైన బెట్టితిరా ! మిమ్మందఱ విఱుచుకొని కఱ కఱ నమలి వేయువఱకు నాపరితాపము చల్లారదు. అనియేమేమోబిగ్గరగా నఱచుచుఁ గన్ను లెఱ్ఱజేయుచుఁ తలవిరియఁబోసుకొని ముందుకు వెనుకకు నూఁగుచు హుమ్మ నుచు నిటునటు గంతులువై చుచు, నేలకొరగుచుఁ బైకిలేచి యెదురనున్నవారిపై లంఘిం చుచు, నిటున నట్టహాల మొనరించుచుండెను. “ఆయింటి యజమాని కడగొట్టుకొడుకు రెండు‌ సంవత్సరముల క్రిందటనే మృతినొందియుండెను. వానికి పిన్ననాఁటినుండియు గడ్డపెఱుగు నేతియప్పములు మిక్కిలి ప్రియములు” వాఁడేయీ సతి నావహించి యున్నవాఁడని యచ్చటివారెల్లరు నిరూపించి వానిం దలంచుచు గుడ్లనీరుగ్రక్కు ర బో నా తను సీ రేద్దాగతిపరనదిరా! అస్‌ దిలసించు సంతన వైయ్యోాపదో