పుట:కాశీమజిలీకథలు-12.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

చుండగనే యత్తగా రచ్చటకు వచ్చినది. నాతో నామె మాట్లాడుట కవకాశము గలిగి నదికాదు. కొంతసేపటి కామె యొంటరిగా నేనున్నచోటునకు వచ్చి ఓసీ ! నీ వా సుందరు నెట్లెరుంగుదువే ! మనయింటి కేమిటికి నిత్యము వచ్చుచుండెనని యడుగు టయు నేను అయ్యో ! ఆ బాబును నే నెత్తి పెంచినదాననే ! నాయం దాయనకు చాల యభిమానము. నిత్యము నా క్షేమ మరయకుండ నుండలేడు. చాల మంచివాఁడని చెప్పితిని. నా మాటల కాఁబోటి తలయూచుచు నా బిందెను వెదకుట కాతఁ డా నాఁ డెంత కష్టపడెననుకొంటివి. నిర్హేతుకముగ నా కొఱకంత శ్రమపడ వలసిన పనియే ముండును. నా బింది నాకిచ్చి యతండెంతేని యుపకారముఁ జేసెను. లేకున్న వీరు నన్నెంత బాధించుచున్నవారో నీవయెరుంగుదువు ఈసారి నీకతఁడు కనిపించినప్పుడు మీ యుపకారంబున నేనెప్పుడు గృతజ్ఞురాలనని నా పలుకులుగా జెప్పము అని చెప్పి యత్తగారు బిలుచుటచేత లోనికి రివ్వున బోయెను. బాబూ ! నాతో నన్నిమాట లెన్నడును బలికి యెఱుంగదు. నీయందామె కభిమాన మున్నట్లామె ముఖలక్షణములఁ బట్టి యా కలించుకొంటిని. తరువాత కృత్యము నీవ యాలోచించుకొమ్మని పలికెను.

మహానందుఁ డాచేటికమాటల కానందము జెందుచు నా మందయానకుఁ దనయం దనురాగము గలిగియున్నదని నిశ్చయించుకొని యొకకమ్మనప్పుడే వ్రాసి దాని నాదూతికచేత కందిచ్చుచు ఓసీ ! ఇఁక నీవేమియు నామెతో మాటాడవలదు. ఈ చీటీ నాబోటి కేకాంతమున నందిచ్చి ప్రత్యుత్తరము దెమ్మనిపంపుటయు నది మఱు నాఁడు వేఁకువజామున యధాప్రకారముగాఁ దనపనికిఁ బోవుదానివలెబోయి యా యుత్తరమిచ్చి కొంతప్రొద్దెక్కుసరికిఁ బ్రత్యుత్తరముఁ దెచ్చి యా మహానందున కంది చ్చెను. దాని నాతం డాత్రముతో విప్పి యిట్లని చదువదొడంగెను.


గీ. అత్తరాకాశి మామగారతి కఠినుఁడు
    మగఁడు సంశయాత్ముండు నామఱఁదిదుష్టుఁ
    డాడబిడ్డలు రాగలుదోడికోడ
    లెవుడు దెప్పుళ్ళమాఱి యింకేమి సేతు.

ఇట్టికఱకు కత్తులబోనులో నిఱికికొంటి. దీనంజేసి‌ నాప్రేమవమ్మటున్నది. అనియున్న ప్రత్యుత్తరమును జూచి ధన్యుండనైతినని యుబ్బుచు నా బిబ్బోకవతి గూర్చి వెండియు నేమో యుత్తరము వ్రాసి మడచి యాదూతకిచ్చి దీని నామెకం దిమ్ము. ఈ రెండుమాడలు గైకొనుమనిచెప్పి దానిచేతిలో నా రొక్కముఁబెట్టెను. ఆ చీటి నా యంబుజాక్షి కది యందఁచేసెను. మఱియు నాఁడు వాఁడుకప్రకారము మహా నందుఁడు వారింటికేగి యామెభర్తతో నిష్టగోష్ఠిం బ్రొ‌ద్దుపుచ్చుచుండ లోననుండి వాని తల్లి తొందరగావచ్చి నాయనా ! నీభార్యకెద్దియో‌ భూతమావేశించినట్లున్నది. తలవిరియ బోసికొని శివమాడుచు కనంబడిన వారినెల్లఁ దిట్టుచుఁ గొట్టుచు గృహమంతయు భీభ త్సముఁజేయుచున్నది. వేగమెవచ్చి ప్రతిక్రియ చేయింపుమని పలుకుటయు నాయ