పుట:కాశీమజిలీకథలు-12.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

తుని యుదంతము నుడివిపోయిరి. కాని యా మహానుభావుని చిత్తంబు పరమేశ్వరా యత్తమై యుండుటచేఁ దనూజుని యాపద‌ నేమియు నెఱుంగ కుండెను. భక్తలోక పారిజాతుండగు నా నీలలోహితుండు సత్వర సమర్థుండగు ప్రమధో త్తము నొక్కని కర్దమ పుత్రుని సంరక్షంబునకు నియోగించెను.

ఈశ్వరాదేశంబున నాప్రమాధుండును నయ్యగాధంబగు కాసార వారి మధ్యంబునం బడి తద్భాలఘాతకి యగు జలచరంబును బట్టికొను తలంపునఁ జలమూని తజ్జలంబులఁ గలియఁ దిరుగుచు తిమితిమింగిల కులంబుల నాకులంబొనర్చుచు సకల జలజీవములకెల్ల నకాలప్రళయమును సంభవింపఁ జేయుచుండెను. అంత నొక కచ్చప శ్రేష్ఠుండు పురుషాకారముతో నాప్రమధుని సన్నిధి కేతెంచి నమస్కరించి వినయ వినముతగాత్రుండై యిట్లనియెను.

మహాత్మా ! యెవ్వడో యొక తుచ్చుం డపకృతి యొనరించెనని మహా క్రోధంబుననిట్లు సర్వజలసర సముదాయంబును నంతమొందిపఁ దివురుట మిము బోట్లకు యుక్తమేనా ? ధర్మసూక్ష్మంబుల మీకన్న జడజీవుండనగు నే నెక్కు డెఱుంగుదునాఁ కోపంబుపసంహరింపుఁడు. మాకులంబుల రక్షింపుఁడు మీకు జరిగిన యపకృతికి ప్రతీకార మూహింపుఁడు అందులకు మేమెల్లరము సహాయ మొనరింతు మని పలుకుటయు నాప్రమధుం డిట్లనియెను.

ఇక్కొలనిలో విహరించుచున్న కర్దమ పుత్రుని నపహరించుకొనిపోయిన యా తుచ్ఛ జలచరాధముం డెవ్వడో పేర్కొనుము. వాని నాకు సత్వరము జూపిం పుము. లేదేని నస్మత్క్రోధానల జ్వాలల నిక్కీలాలా వాసులనెల్ల భస్మమొనరింతు నని రూక్షముగా పలుకుచున్న వానికి తామేటి మేటి యిట్లనియెను. ఆర్యా ! శాంతిం పుడు. ఆ బాలకు నపహరించిన వాఁడెవ్వడో‌ నేనెఱింగివచ్చి తమకు విన్నవించు కొనెదను. అందులకు నాకుఁ గొంత గడువీయవలయునని ప్రార్దించుటయు నతండు ఓరీ ! నీ వెవండవో నేనెఱుంగను. నిన్ను నమ్మి నా ప్రయత్నమునుండి విరమిం చుట యుక్తముగాఁ గనుపించుటలేదు. ఈ యాపద దప్పించుకొనుట కెద్దియో బూట కంబులఁ బన్నుచుంటివేమో ? ఎవ్వ రెఱుంగుదురు. నీ మాటలు విశ్వసించుటకు తగిన హేతువుఁ జూపించినగాని నమ్మజాల ననుటయు నా పురుషుండిట్ట నియె.

దేవా! నిన్ను మోసపుచ్చి నేపోయిన నేమాయెను. నే నసత్యవాదినని తెలిసిన పిమ్మట నీ కోపం బాపుట కెప్వరు సమర్థులగుదురు ? ఇప్పుడు గాకున్న నెప్పుడైన నీసర్వనాశన ప్రయత్నము విడిచెదవా యేమి? నే నసత్యము లాడుటలేదు. నేను కచ్చపవంశ సంజుతుండను. పెద్దకాలమునుండి యీ కాసారము నాశ్రయించి యుంటిని. నీ కోపినంత సహాయముచేసి నాకులంబును నీవలన నుపద్రవంబులేకుండ గాపాడుకొనఁ జూచుచుంటినిఁగాని మరొం డెద్ధియుఁగాదు. నేను తిరిగివచ్చు పర్యంతము