పుట:కాశీమజిలీకథలు-12.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శుచిష్మంతుని కథ

255

మూలాదుల మార్గస్తులకు భక్షింప నొసంగుచు, దిధిక్షీరఘృతంబుల నుచితముగ నిచ్చుచ్చు శిశితాంబుల దెప్పించి పానీయంబుగ నొసంగుచు, రోగార్తుల కుపచారంబుల జేయుచుఁ, దస్కరులవలన బాధలేకుండునట్లు పరిజనుల సహాయమిచ్చును, మిక్కిలి గౌరవించుచుండెను. అంతకుపూర్వ మా యవసధంబెంత భయంకరముగా నుండెడి దియో యిప్పుడు పింగాక్షుని సహాయమువలన నంతసంతోష జనకమైనది.

అతం డిట్లుత్తమరీతిని కాలక్షేపము సేయుచుండ క్రమంబున నతనిఖ్యాతి దేశదేశంబుల వ్యాపించినది. భోజనాంతములను జపాంతములను వానిని నాశీర్వదించుచు వాని నామస్మరణచేయుచుందురు ఇట్లుండ నొక నాడతని పితృవ్యుండు తారకుఁడను శబరుండు కొందరు లుబ్ధకుల సహాయమున మార్గంబరిగట్టి గొందఱు తీర్థవాసులాదారిం బోవుచుండ వారిపైబడి వారిసొత్తెల్ల దోచుకొనెను. ఆతైర్ధికులును భయవిహ్వలులై యార్తిఁజెంది కేకలుపెట్టుచుండెను. పింగాక్షుండు దైవికముగా నాదారిఁబోవుచు నయార్తధ్వని నాలకించి యదరిపడి పెద్దయెలుంగున నోహో ! నేను గలుగ మీకుభయం బేల యని వడి వడింజని యొక్కుమ్మడి యాపాటచ్చరులపైఁ బడి‌ ఘోరయుద్ధంబున వారిం బాఱఁదోలి యాపాంధుల నిశ్చితంగా సాగనంపెను. పిమ్మట పింగాక్షుండు నిజ గృహమున కేతెంచి యాసంకుల సమరంబున మేనందగిలిన గాయంబులవలన విగత జీవుం డయ్యెను. అనేక సంవత్సరములు గాశీయాత్రాపరులకు సపర్య లొనరించి పుణ్యంబువలన నా పింగాక్షుండు జన్మాంతరమున ననన్య సులభంబగు దిగీశ్వరత్వంబు బొంది నికృతియై బుట్టె నిదియో నిరృతి వృత్తాంతము అని చెప్పి తరువాయికథ ముందు మజిలీ యం దిట్లని జెప్పదొడంగెను.

342 వ మజిలీ.

శుచిష్మంతుని కథ

పూర్వకాలంబున శివపూజా ధురంధరుడగు కర్దమ ప్రజాపతికి శుచిష్మం తుండను పుత్రుండు గలఁడు. ఆ కుమారుండు చిరుత ప్రాయమునందు సంగడి కాండ్రతో విలాసముగాఁ దిరుగుచు నచ్చోదంబను పెద్దసరస్సులో నొకనాఁడు సలిల క్రీడ లొనరించుచుండెను. అందొక నక్ర మపక్ర విక్రమంబున శుచిత్మంతుని కా లొడలిపట్టి పటురయంబున లోపల కీడ్చుకొని పోయెను. ఆయువకుం డట్లు జలంబుల మునుంచు నంగడి కాండ్ర నుద్దేశించి పెద్దయెలుంగున నాక్రోశించుచుఁ దనయాపద నెఱిగించి రక్షింపుడని ప్రార్దించెను. కాని తోడి వా రెవ్వరు వానికేమియు సహాయము జేయలేకపోయిరి.