పుట:కాశీమజిలీకథలు-12.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దనంజయుని కథ

253

యెముకలు నేను గాశికి పోవుచుంటిని గదా యని యెప్పుడో దాచియుంచిన పెద్దల యస్థులను గంగలో వైచి రమ్మని మావాండ్రు నాకిచ్చిరి. ఎట్లయినను కాశి కేగు చుంటినిగదా వీలైన వాటిని గంగలో పారవేయుట కేమి కష్టమని నేనందుల కంగీక రించి తెచ్చితిని. వాటిని గంగలో వేసిననేమి మరియొకచోట పారవయిచిననేమి? దాని తోనే చచ్చినవారికి మోక్షమువచ్చునా యేమి? ఆపెట్టె నెచ్చటనో పాఱఁవేసి నే నందు లకు కినియుదు నని తన భృతినైన గొనకుండ నాతో చెప్పకుండ తిరిగివచ్చిన నీమగని కంటె బుద్ధిహీనుం డింకొకఁ డుండునా? నాతోఁ వాఁడు మార్గములో పడిన కష్టము నకు దానికి నే నీయవలసిన కూలి నెగవేయుట పాప హేతువని దలంచి యింటికి వచ్చి తిని. వాఁడు లేకున్న నే నా సొమ్మెట్లీయ గలనని బలుకుటయు నాబోయది సొమ్మిచ్చు నని భ్రమపడి అయ్యా ! మీరు చాలమంచివారు. ఒకరి కష్టము మిగుల్చుకొనువారుకారు. మీ పెట్టె నా కాశీపట్టణంబులో నెవ్వరో దొంగలు ధన మం దున్నదని యాశపడి నా మగని నన్నిధినుండి యపహరించుకొని పోయిరట. దానికి మీరేమి చేయుదురో యని భయముచేత నింటికి పారివచ్చిన మాట నిజము. మీ రేమందురో యని మిమ్ము జూచు టకు సిగ్గపడుచు లోన దాగియున్నాడు. పోనిండు మీరీయవలసినసొమ్ము నా కీయ కూడదా యనుటయు నతండు అమ్మీ ! నేను ప్రమాణము జేసి చెప్పుచున్నాను పెట్టె పోయినందులకు నేను వాని నేమియు గినియను. నన్ను వాని సమీపంబునకు దోడ్కొని పొమ్ము. వాడును నేనును లెక్క జూచుకొనకుండ సొమ్ము నీచేతి కెట్టిమ్మందువని యనునయ పూర్వకముగా పలుకుచున్న వానిమాటలయందు నమ్మికపుట్టి యా చెంచెత లోనికరిగి భర్తను కుదుటగరపి వానిం దీసుకొనివచ్చి యాకోమటి యెదుటం బెట్టినది. ధనంజయుడును వాని కీయవలసిన కూలియంతయు లెక్కించి యప్పుడే యిచ్చి వేసి వారికి సంతోషము గలుగఁజేసెను. ఇట్లాబోయవానితోఁ గ్రమంబున నతిమైత్రిని సంపా దించి యొక్కనాఁడు ధనంజయుండు మిగుల దీనాననుండై వానితో నిట్లనియె. స్నేహితుండా ! నేను నిన్నొకటి యడిగెదను దాన నీవు మఱొక లాగున దలంపక నిక్కము వచింపుము. దాన నీకేమియు భయములేదు. కాశిలో నేను నీకిచ్చిన యస్థికల పెట్టె నెవ్వరో బరులపహరించిరని నీభార్య జెప్పినది. గాని యామాటలు నాకేమియు నమ్మకముగా లేవు. నీవాపెట్టె నేమిచేసితివి? అందున్న యస్థులు మా యమ్మవి. వానిని భాగీరధీజలంబునగలపి మాతృఋణము దీర్చుకొన గంపెడాసతో నే నన్నికష్ట ములుపడి కాశికిం జేరితిని. తుదకాపని జేయకుంటిని గదా ! యని హృదయతాపంబున గొట్టుకొను చుంటిని. ఆయస్థుల నేమిసేసితివో చెప్పి యవి నీయొద్దనున్న నాకిమ్ము. నీకు పుణ్యము రాగలదని మిక్కిలి బ్రతిమాలుచున్న నావైశ్యకులోత్తమునితో నా చెంచెత యిట్లనియె.

అయ్యా ! బుద్ధిహీనుండనై యాపాపము నే మూటగట్టుకొంటిని. యా పెట్టె యందు మిక్కిలి రొక్కముండునని దురాశపడి దాని నపహరించిన మూఢుడను నేనే.