పుట:కాశీమజిలీకథలు-12.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

కొనిపోయెను. మృతినొందిన జనయిత్రింగాంచి యాకుమారుడు గాశికిబోవలయునను నీకోర్కె దీర్పఁజాలనైతినిగదాయని మిక్కిలి విచారించుచు తల్లి యపరక్రియల విధ్యుక్తంబుగ నొనరించి యామె యస్థులనైనం గంగలో గలిపి తల్లి కోరికనుదీర్చి కృతకృత్యుండ నగుదునని దలంచి యామె కీకస శకంబుల సంగ్రహించి వస్త్రంబున జుట్టి పదిలముగా రాగిపెట్టైలోఁబెట్టి తాళమువైచి గాశికిఁ బయనమై యాపెట్టె మోసి కొని యొక్కరుండునుఁ బోయెను.

అట్లుపోయి పెరగిరివననదీపట్టణంబుల దాటుచు నెడద నెడద గమనా యాసంబుదీర నాగుచు నతికష్టంబున నాపేటికఁబూని కొన్ని పయనంబుల సాగించెను. అందొకపల్లెలో నొకభిల్లుని కూలి కేర్పాటు చేసికొని యా పెట్టె వానిచేత మోయించు కొనుచు మార్గంబున ననేక బాధలఁబడుచు నెట్టకేలకుఁ గొన్నిమాసములకు గాశీపట్ట ణంబుఁ జేర గలిగెను. అందొక వణిజునింట బసజేసి యంగడికింబోయి వలయు పదా ర్థంబులఁ గొనివత్తుననిచెప్పి యాభిల్లు నందుండ నియమించి పోయెను.

ఇంతలో నాపునిందుఁ డా పేటికభారమునుబట్టి యందు ధన మున్నదని తలంచి యాధనంజయుఁడు మగుడి వచ్చులోపల పెట్టెతో మాయమయ్యెను. ఆ వైశ్యు డును వలయు పదార్దములన్నియుఁ గొని వచ్చి యందాశబరుని గానక తల్లి యస్థులు గల నాపేటికతో వాఁడు పోవుటకు దల్లడిల్లుచు నాయస్థులు గల నాపేటికతో వాఁడు పోవుటకు దల్ల డిల్లుచు నాయస్థుల గంగలోగలుపజాల నైతినే యని పరిపరివిధంబుల విల పించుచు వాఁ‌ డా పెట్టెలో ధనమున్నదని దలంచి యట్లపహరించుకొని పోయెనని నిశ్చయించి యెట్లయినను వానింగని పెట్టి యాయస్థులందెచ్చి గంగలోకలిపి మాతృ ఋణము దీర్పువలయునని తలంచి యప్పుడే యతండు మున్ను దానుజూచిన యా బోయపల్లెకు బ్రయాణమై పోయెను.

ధనంజయు డట్లు బోయపల్లెకు మిగుల శ్రమంబుల నరిగ యందాచెంచు వాని గృహంబుజేరి వానింజేరినంత గురుతుపట్టి యా యాటవికుండు భయంపడి దాగి యుండి తనభార్యకు చెప్పవలసిన విధంబంతయును బోధించి యావలకుం బంపెను. ఆ చెంచతయును ధనంజయుని సన్నిధి కేతెంచి తనభర్త యింటలేడనియు మీతో గాశికి వచ్చిన నాటంగోలె వాఁడు తిరిగి రాలేదనియు జెప్పుచు అయ్యా! మీరిందొక్కరే వచ్చితిరేమి? నాభర్త యేమయ్యెనని యెదురు ప్రశ్నింప దొడంగినది.

కోమటి దాని యాకార చేష్ఠాప్రకారంబంతయుఁజూచి అది యసత్యమాడు చుండెనని గ్రహించి మంచిమాటలచే దానివలన వాని యునికిదెలిసికొనవలెనని యెంచి, యోసీ ! నీమగ డింత పిరికివాఁ డయ్యెనేమి? అంతదూరము నాతో కష్టపడి వచ్చియు కూలియైన బుచ్చుకొనక ముందువచ్చెనేమి? నేను వానిని నాతో సహవాసంబునకు గదుర్చుకొని తీసికొనిపోతిని గాని యాపెట్టె మోయుటకుగాదు. దానిలో నేమున్నది