పుట:కాశీమజిలీకథలు-12.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

250

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

లచే జేయించుచుండ తెలివివచ్చి యా భిక్షుకుండు దాహము దాహమని హస్తసౌంజ్ఞల జేయుచు దెలియజేసెను. తోడనే నిర్మలోదకము తెప్పించి వాని కిచ్చిరి. పిమ్మట కొంత సేపటికి స్వస్థత గలిగి లేచి కూర్చుని యా పింగాక్షుంగాంచి యల్లన నిట్లనియె.

మహారణ్యంబున దోఁపుడుగాండ్రచే మ్రద్దింపఁబడి దిక్కులేక‌ పడియున్న నన్ను నీ వెవ్వఁడవో దేవునివలెవచ్చి కాపాడితివి. సమయమునకు నీవు రాకున్న నే నీపాటికా దెబ్బతోఁ బరలోకమునకు బోవలసినదే ? నాకు నీవు ప్రాణదాతవై మిక్కిలి సుకృతము గడించితివి. నీ వృత్తాంతము విన కుతూహల వడుచున్నానని బలుకుటయు నా భిల్లనాయకుం డిట్లనియె.

అయ్యా ! నేనీపల్లెకు యెకిమీడుండను. శబరుండను పింగాక్షుండనువాఁ డను. నేటి యుదయమున నీప్రాంత కాంతారములకు మృగయావినోదంబున బోయి తిరిగివచ్చుచు మార్గమందు స్మృతిదప్పి వపడియున్న మిమ్ముజూచి యొక యోషధీవిశే షంబున మీ గాయమును కుదిర్చితిని. మీ‌రు పునర్జీవితులయగుటయు నాకెంతేని సంతో షముగా నున్నది. మీ రెందేగుచు నిందు వచ్చి యీవిధమున బాధపడితిరి. మిమ్ము గొట్టినవా రెవ్వరని యడిగిన నాజటిలుం డిట్లనియెను.

ప్రాణదాతా ! నీయవ్యాజ కరుణాకటాక్షంబుల దెంతేని గొనియాడగలను. నీవుజేసిన యుపకారం బీజన్మావధిలో నెన్నఁడును మఱువఁజాలను. నేనొక విరక్తుం డను. కాశికింబోయి యందు విశ్వనాధుని సందర్శించుటకు నేనీదారిం జనుచుంటిని. వెనుకటి మజిలీయందు కొందరు పుణ్యాత్ములు నన్నీమార్గంబున నొంటరిగా బోగూడ దనియు నట్లుపోయిన దొంగలవలన నపాయము వచ్చుననియు నెంత చెప్పినను వినక దొంగలు నన్నేమిచేయగలరు ? వారివలన నాకెట్టి భయము కలుగదని విశ్వేశ్వర సంద ర్శనలాలసుండనై వారిమాటలం ద్రోసిపుచ్చి వచ్చితిని. ఇచ్చటికిఁ జేరుసరికి గొందరు మన్నెగాండ్రు వచ్చి నన్నాటంకపెట్టి నాయొద్ద నేమియులేదని నేనెంతజెప్పినను వినక నన్నుఁ జావఁగొట్టి, పిదప వారేమైరొ నాకుఁ దెలియదు. నీవలన నేను బ్రతికితిని. ఇదియే నా వృత్తాంతము. నే నిప్పుడు మిగుల క్షుద్బాధా పీడితుడనై యుంటిని. తినుట కేమయిన నిచ్చి నన్ను రక్షించి కాశికిఁ బంపుము ఆ కాశీ సందర్శనంబున గలుగు సుకృతంబున నీకర్థభాగ మిచ్చుచున్నానని బలుకుటయును నా భిల్లపతి యప్పుడే కొంద ఱంబంపి కొన్ని ఫలంబులను గోక్షీరంబులను దెప్పెంచి వానికిచ్చెను. ఆ ఫలంబులఁ దిని యాపాలను ద్రావినంత మేనికి బలము గలుగగనేలేచి యా బోయదొరతో వాని గృహమునకేగి వాని యనుమతంబున కొంతకాల మందు విశ్రమించెను. ఆ జటిలున కారోగ్యము కుదిరినకొలఁది మేనిక జవసత్వములు వృద్దిపొందసాగినవి. పిమ్మట నా యతి యొకనాఁడు పింగాక్షునితో చపాన పింగల యెకిసీనా & సీయి






యులోగ్వవంతిన పతన. ఇ? నారు.గా శరింటో.