పుట:కాశీమజిలీకథలు-12.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగాక్షుని కథ

249

చేత యాత్రాపరులు పెద్ద పెద్ద జట్టులుగా జేరగాని యా మజిలీ దాటజాలరు. అది దాటిన సుఖముగా నిఁకఁ గాశి జేరవచ్చునని సంతోషించుచుందురు.

అట్టి దారుణారణ్యమార్గం బనుసరించి యొకనా డొక భిక్షుకుండు బోవు చుండుటయును నచ్చటి శబరులు గొందరు వాని చుట్టు ముట్టడించి యోరీ ! నీయొద్ద నున్న ముల్లె నిందు బెట్టుము. లేకున్న నీతల యెగిరిపడున‌ని రూక్షముగా బలుక సాగిరి. వారిమాటల కా బాటసారి యించుకయు వెరువక “శబరులారా ! బిక్షుకుండ నగు నాయొద్ద నేముండును. ఈ పులితోలు, వెదురుకర్ర, లాతము, మట్టిచిప్ప, జేబురు గుడ్డలు మాత్రమే నాయొద్దగల ధనములు దీనిం గావలసిన బుచ్చుకొని యుపయోగించు కొనుఁడు. ఈ మజిలీ వెనుకటినుండి గడుదీర్ఘమగుటచేతను నెదుర నెందును జనపదం బులు లేకుండుటచేతను భిక్షుకుదరక నా మనంబున గమనాయాసంబున మిగుల తహ తహం బడుచుంటిని మీకు మంచి పుణ్యమురాగలదు. నన్ను మీ‌ పల్లెకు గొనిపోయి యిన్ని గోక్షీరములైన ద్రావనిచ్చి పుణ్యంబు గట్టుకొనుడు” అని బలుకుచున్న‌ యా బైరాగిం జూచి యా యాటవికులు నవ్వాపుకొనుచు నిట్లనిరి. "బిచ్చగాడా ! నీ ముచ్చటలు గడు విచిత్రములుగా నున్నవే ? దారులగాచి బాటసారుల దోచుకొను మా యొద్ద నేమైన గుంజులాడ బ్రయత్నించుచున్నట్లున్నది. నీ మాటలనమ్మి మోస పోవువా రిందెవ్వరును లేరు. మ్రుచ్చుల మోసగించుటకు రొక్కము జిక్కములలో బెట్టి మొలకు జుట్టుకొని యేమియు దేనట్లు నటించువారి నెందఱ మే మింతవరకు జూచి యుండలేదు. చేత గాసైన లేకుండఁ బొరుగూరికి బోవువారెందైన నుందురా ! పెక్కు మాటలు మాని నీయొద్దనున్న దేమో యిచ్చటఁ బెట్టుము. లేకున్న బలవంతముగఁ బైఁబడి లాగికొందుము” అని పలికెను. మరియొకడు మాటలవలన సొమ్మూడి పడు నటరా ! యనుచు చేతనున్న దుడ్డుకఱ్ఱతో నా జటిలుని నడినెత్తిమీదఁ గొట్టెను. తోడనే యయ్యతి హరాహరా ! హా ! కాశీవిశ్వేశ్వరా ! యని యఱచుచు స్మృతిదప్పి నేలఁ బడెను.

ఆ తెక్కలికాండ్రు వానియొద్ద నేమైన‌ రొక్కమున్నదేమో యని వాని బెద్దగా పరిశీలించిరి. గాని వారికేమియు దొరికినదికాదు. చచ్చినవాఁడు చేతఁ గాసై నను బట్టుకుని రాకుండ మనల నందరను వృధాగా శ్రమబెట్టెనని విసిగికొనుచు నా భిక్షుకుని కళేబర మా మార్గమధ్యమందే పడవైచి వచ్చినదారింబట్టి యెందేనిఁబోయిరి. ఇంతలో బింగాక్షుండు దైవికముగా నాదారింబోవుచు యందు మృతుఁడైనట్లు పడి యున్న యాపారికాంక్షి వీక్షింక్షి యక్కజంపడుచు సన్నిధి కేతెంచి వాని‌ యౌదలఁ గల గాయమును గనిపెట్టి యిప్పుడే యెవ్వరో వానిగొట్టిపోయిరని నిశ్చయించి యెద్దియో యాకుదెచ్చి దానిరసము నా గాయముపై బిండెను. కొంతసేపటి కాజటిలునకు చైతన్యము కలిగినది. ఆ భిల్లపరివృధుండి పంచు. వానిసన్నిధినేయుండి తగిన యుపచారములు సేవకు