పుట:కాశీమజిలీకథలు-12.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


క. అని చెప్పిన విని గోపుఁడు
   ఘనవిస్మయ సుప్రహర్ష కలితాత్ముండై
   ప్రణుతించెఁ దపసి తపసియు
   జనియెం దదనంతరావసధమున కంతన్‌.

340 వ మజిలీ



క. శ్రీ పార్వతీ మనోహర !
   లోపాముద్రేశ్వరేంద్ర ! లోలార్క సమ
   ర్చాపర ! విశ్వేశ్వర ! కా
   శీపురపరిపాల ! దుష్ట శిక్షాశీలా !

దేవా ! అవధరింపుమట్లు మణిసిద్ధ యతీంద్రుఁడు గోపశిష్యునితో గాశీ యాత్రఁ గావింపుచు గ్రమంబున చతుశ్చత్వార్యధిక త్రిశతి తమ నివాస స్టానంబుఁ జేరి నిత్యానుష్టానంబులఁ దీర్చుకొని భుక్తోపవిష్టుండై శిష్యునిరాక నరయుచున్నంతలో నగ్గోపాలుఁడు వచ్చి యయ్యవారికి నమస్కరించుచు నిట్లనియె.


శా. సామీ ! కాశికి నెంతకాలమునకున్‌ సాగంగనౌ మీ కటా
    క్షామూల్యద్యుతిఁ జేసి లోకమున విఖ్యాతంబులై నెన్ని యేఁ
    బ్రామాణ్వంబులతో మహో త్తర కథల్‌ పాటించి నే వింటిఁ గా
    శీ మహాత్మ్యమికన్‌ వినం దలచితిన్‌ జెప్పంగదే యొప్పుగన్‌.

అనిన విని గురుండు వాని సౌశీల్యంబులకు మెచ్చుకొని గోపా! లే ! లెమ్ము ! వేళ మిగిలినది భుజింపుము. నీ వడిగిన యర్థంబులు చెప్పెద ననుటయు గోపాలుండును సావడివచ్చి యొజ్జల పాదంబులనొత్తుచు శుశ్రూషఁ జేయుచుండ మణిసిద్ధ యతీంద్రుఁడు నమ్మణివిశేషంబున నంతయుఁ దెలిసికొని‌ యిట్లనియె. గోపా ! నీ ప్రశ్న వృధాకాదు. దీనవైళ్వానర నిరృతి వరుణాది దిక్పతుల పూర్వోదంతము దెలియఁవచ్చెడిని వినుము.

పింగాక్షునికథ

వింద్యపర్వత ప్రాంతారణ్యంబున నొక లోయపల్లెగలదు.. దాని కధినాయ కుండై పింగాక్షుండను బోయదొఱ పరిపాలించుచుండెను. కాశికిఁ బోవు తైర్థికు లామార్గంబుననే బోవుచు నీ బోయపల్లె పజ్జంగల చెఱువు సమీపమున విరాజిల్లు తింత్రిణీవృక్షమునక్రింద బసచేయు నలవాటు గలదు. అ చుట్టుపక్కల నెందును జలా శయము లేమి కునికి యీ మజిలీ యాత్రాపకులకు రాకపోకలయందు తప్పనిదయ్యె అచ్చట ముష్కరులగు కిరాతులవలన దోపుడు భయం బెక్కువగా గలిగియుండుట