పుట:కాశీమజిలీకథలు-12.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురప్రవేశము కథ

245


మ. అతిలావణ్యచేత నింపెసఁగు నీయబ్జాక్షిలోఁగూడి యు
     న్నతిరీతిన్‌ గను నిన్నుజూచి తలఁతున్‌ గౌరీయుతుండౌ జగ
     త్పతిరీతిన్‌ శచితోడి యింద్రుగతి నాపద్మాలయాయుక్తుఁడ
     చ్యుతలీలన్‌ ధరణీతలేంద్ర ! మదిలో నుత్సాహమేపారఁగన్‌.

అని వచింప పుండరీకుండు తా నాదుర్గమారణ్యంబున నుదయసుందరిని గనుంగొనినవిధాన మంతయును మాయాబలున కెఱింగించి వానికిం ముదము గూర్చెను. మఱియు నాదుస్తరారణ్యమధ్యమునుండి వెడలి ప్రతిష్టానపురంబును జేరు కొనఁదగు తెఱవు నిఖిలమాయా ప్రయోగనిపుణుండవగు నీ వాలోచింపవలయునని యా రాజేంద్రుం డనినతోడనే మాయాబలుం డదృశ్యుం డయ్యెను.

తోడనే విమలమణికింకిణీచక్రవాకపూరితమై స్వర్గనిర్మాణరమ్యమై యొప్పు గులుకు విమానమొండు వారియెదట నిలచెను. అప్పు డశరీరవాక్కు‌ నిట్లు వినం బడెను, ఓహో ! క్ష్మాపాలపుంగవా ! నేను మాయాబలుండను. గగనమార్గంబున మిమ్ముఁ బ్రతిష్టానగరంబునకుఁ గొనిపోవ మాయచే విమానముగమారి మీయెదుట నున్నవాఁడను. దీని నధిష్టించినతోడనే మిమ్ము మనోవేగంబునఁ మీ నగరమునకుఁ దోడ్కొనిపోఁగలవాఁడనని మాయాబలుం డదృష్టమూర్తియై పలికినమాటల నాలకించి యత్యంతానందమునుబొంది మనంబునఁ గలంకమునుబాపి దంభోళినందుండియే పంపి వేయ నుద్దేశించి యుదయసుందరివంక జూచెను.

ఆమెయును బ్రాణేశ్వరుని యింగితమెఱింగి దంభోళివలనం దారావళి తమ బందుగుల యోగక్షేమము లెఱిగింప పిదప నత్యాదరంబున వాని కిట్లనియె. సోదరా ! ఇప్పటికే జాగయ్యెను. అభీష్ట సిద్ధింబడసిన నీవతిజవంబునఁ బాతాళంబున నా జనకుని సమక్షమునకేగి మదీయశుభోదర్క మెఱింగింపుము. మర్త్యలోకములోఁ ద్రిభువనం బులఁ బ్రసిద్ధికెక్కిన ప్రతిష్టానపురంబునందు నే నతిసంతోషముతో సుఖముగా నుంటి నని వచింపుము. తారావళి మాతోఁ బ్రతిష్టానపురంబున కేతెంచి యచ్చటఁ దన కిచ్చ యున్న నాసన్నిధి నుండుటగాని లేక పాతాళమునకుఁ దిరిగివచ్చుటగాని జేయఁగలదని చెప్పుము అని వచించి వాని నతివినయంబున వీడ్కొల్పెను. వాఁడును బంధుభావోచి తంబుగ నుదయసుందరితో సంభాషించి, సంతతము నామె నేమరకుండుమని తారా వళితోఁ జెప్పి యా రాజేంద్రునకు వినయంబునఁ బ్రమాణంబు లర్పించి విమాన రూపముననున్న మాయాబలుని యనుజ్ఞఁ గైకొని యా క్షణంబుననే పవనభావంబంది యంత ర్హితుం డయ్యెను.

పిమ్మట నా రాజేంద్రుం డపరిమితసంతోషముతోఁ దొలుత నుదయ సుందరి బిదపఁ దారావళిని నా విమాన మెక్కించి వారిమధ్య దానాసీనుఁ డయ్యెను. తోడనే యది యందుండి పైకిలేచి గగన మూర్గంబున నిముషములోఁ బ్రతిష్టానగరము