పుట:కాశీమజిలీకథలు-12.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురప్రవేశము కథ

243

సంభవించిన కిరణకోశమనురత్నము. సకల విషకారమూర్చాంగ పరివర్తనాద్య శేషాపాయములఁ దప్పింప సమర్దమయినది. ఆపదలకు నెలవగు నీ వననివాసంబున దీనిం బడయుట శ్రేయస్కరమని ప్రియముమీఱ బలుకుచుఁ నామెకుఁ దీనిని జూడా రత్నముగా నొసంగి యూఱకుండెను.

అప్పుడు నేను వానిదుర్వారశాపోక్తులవిని దుర్భరదావానల జ్వాలలంవడు వనవృక్షములలీల తోడనే వివర్ణుడనై పరయువతీ రత్నాపహారపాపంబునకు ఫలంబు గంటినని పశ్చాత్తాపమందుచు నవనమితమౌళినై యా మునీంద్రునకుఁ బ్రణమిల్లుచు వినయంబున నిట్లంటిని. మహాత్మా ! శాంతి వహింపుము. అజ్ఞానతిమిరంబునఁ గన్ను గానక వివేకహీనుడనై యధర్మంబునఁ ప్రవర్తించిన నాకు కరుణాతరంగుడవై శాపాంత మును బ్రసాదింపుమని ప్రార్థింప నా మునీంద్రుండు దయార్ద్రహృదయుండై తల పంకించుచు “సరే, కానిమ్ము. ఈ యరణ్యంబున‌ నీమెను ప్రతిష్టాననగరాధీశ్వరుండగు పుండరీక రాజేంద్రుం డెప్పుడు జేపట్టి నీచెంప వాయఁగొట్టునో యా క్షణముననే నీకు శాపాంతమగునని నన్ననుగ్రహించెను.

పిదప నేనా మునీంద్రుని యానతి నౌదలందాల్చి తోడనే కోఁతినై యిమ్మణి భవనంబున నీమెను సంరక్షించుచు భవదాగమనమును బ్రతీక్షించి యుంటిని. నేఁటికి నా పుణ్యవశంబున నీ వేతెంచి నా శాపదోషమును బోఁగొట్టితివి. ఈ పర్వతము రవిశృంగమనియును సరోవరము కువలయామోద మనియును మునీంద్రుని మాటల ధోరణిని మనవిచేసియే యుంటిని. ఈ మణిమందిరము వానియాజ్ఞాసిద్ధమైనదనికూడ మనవిచేసికొని యుంటిని. ఓ లోకోపకారపరాయణా ! పుణ్యాత్మా ! నీ వడిగిన వృత్తాంతమెల్లఁ జెప్పితిని. ఇఁక నాకు సెలవొసంగుమని వచించి యా రాజేంద్రు ననుమతంబు వడసి యా విద్యాధరుఁడు మింటికెగసి నిముసములో నదృశ్యుఁ డయ్యెను.

342 వ మజిలీ

పురప్రవేశము

అట్లు మర్కటరూపమునువిడచి నిజవృత్తాంత మెఱిగించి విద్యాధరుఁ డఱి గినపిమ్మట నా రాజశేఖరుండు నల్దెసలఁ బరికించుచు నభీష్టయువతీసంగమాభినందన పురస్పరంబుగ నిట్లని విచారింపఁ దొడంగెను. అనుకూలదైవప్రభావంబున నా ప్లవం గము ననుసరించి వచ్చి నే నిచ్చోట నాప్రాణేశ్వరి నత్యద్భుతంబుగఁ గలిసికొనఁ గలిగతిని. ఇష్టజనయోగదుఃఖముదప్ప మఱొకకష్ట మేమియు నీమె యనుభవించి యుండలేదు. ఈ మహారణ్యము దిక్కులనెల్ల నాక్రమించుకొని యుండుటచేఁ బుడ మిలో నీ ప్రదేశమెచ్చటిదో తెలియకున్నది. ప్రతిష్టాననగర మేదిక్కున నెంతదూర