పుట:కాశీమజిలీకథలు-12.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

240

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నీ విట్లు స్థిరత్వమునుబూనుట సమంజసమేనా ? ఓ యథధినాధా ! నీ తనూజయగు లక్ష్మి కితండు పతిగదా ! యేమిటికట్లు జడత్వము వహించెదవు? దిక్పాలులారా ! సకలదిగ్విజయం బందు వీనిచే మీ నగరములు సంరక్షింపబడెను. మీ రేమిటి కట్లు దూరముననుండి యూరక చూచుచుండెదరు ? ఓహో ! సూర్యుఁడా ! తేజంబున నీ వీతనికి సోదరుఁడవు. ఇట్లు నీవేమిటి కుదాసీనుఁడవై తిరిగెదవు ? మీ రెల్లరు నే మై యీ దుష్టవనచరాధమునిచే హింసింపఁబడుచున్న యీ జగదేక నాయకుని సమక్షమున కేతెంచి వీనిపక్షమై యుండరేమిటికని యుదయసుందరి యత్యంత భయాకులయై గడ గడ లాడుచుండెను. అప్పుడా భూతలేంద్రుం డిట్లని వితర్కించుకొనెను.

ఔరా ! వీఁడు సామర్థ్యవిహీనుఁడు. సత్యశూన్యుఁడు. స్వభావచపలుఁడు. కాతరనిదర్శకుండు. ఇట్టి వీనిపై త్రిభువన జేగీయమాన విక్రముండనగు నే నెట్లు శస్త్ర మేయఁగమకింతును ? నే నూఱకున్న నీ లతాంగిభయం బుడుగనేరదు. కావున వీని నిగ్రహించెదంగాక. ఉచితప్రహారంబున వీని మూర్చితుంజేసి యీమెం గొనిపోవలయునని నిశ్చయించి దక్షిణపాణినెత్తి యా కోఁతి చెంపమీఁద గట్టిగా జఱచెను.


గీ. తోడనే కోఁతిరూపమువీడి దివ్య
    పురుషదేహ మంది కిరీటభూషణాధి
    కమును దాల్చి విమానయానమున దివ్య
    సతులు గొల్వఁగనుండి భూపతిని బొగడె.

అట్లు సాధువాదంబు లొనర్చుచు రాజున కిట్లనియె ఓ క్షితీశతిలకా ! నీ యనుగ్రహంబున నేను నిజస్వరూప మందగలిగితిని. పోయివచ్చెదను నా నివాసమున కరుగుట కంతరావళమున నెంతవిలంబగునో యెఱుంగను. కావున నేఁ బోవుట కనుజ్ఞ నొసంగుము. ఓ పుండరీక రాజేంద్రా! మనుజభువనైక చక్రవర్తినీ లక్షణలక్షితయగు‌ నీ యంగనామణిని దేవేరిగాఁ బరిగ్రహించి నిజనివాసంబగు ప్రతిష్ఠాన నగరంబున కరుగుము. నీకొఱకే విధివలన సృజింపఁబడిన యీ యన్నులమిన్న నింతదనుక నే నిందుఁ గాపాడుచుంటినని బలుక నా రాజేంద్రుండు విస్మయమందుచు నింపుగొలుపు పలుకుల వాని కిట్లనియె.

ఓ వివేకచూడామణీ ! నీ వెవ్వరో తెలుపుము. ఇట్టి దివ్యాకృతినిబాసి వనచరుండవై యేమిటి కాపదపాలై తివి? ఈ మృగాక్షి నెందుకొఱ కిందు సంరక్షించుచు గష్టపడుచుంటివి ? ఈమె కెందునిమిత్తమిట్లు వనవాసదుఃఖము గలిగించితివి ? నాకర ప్రహారంబున నీ కెట్లు పూర్వరూప మబ్బఁగలిగెను ? నా పేరును నా నగరముపేరును నీ వెట్లు తెలిసికొంటివి? ఈ మహాపర్వత మెయ్యది ? అంభో-సోదరియగు నీ సుందర‌ సరోవరము పేరెయ్యది? మఱియు ము. పేరున నిర్మింపఁ బడినది ? అని యిట్లు ప్రశ్నించు నృపతిలకున