పుట:కాశీమజిలీకథలు-12.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

అప్పుడు రాజు మనంబున దిగులొంది యౌరా! నే నిప్పుడు ప్రచ్చన్నముగా నుండుటఁ దగదు. నా యొద్దఁ గల మణి దేహపరివర్తనవికారము బోఁగొట్టఁగలిగి నప్పుడు మూర్చాది దోషముల నెందులకుఁ దొలఁగింపజాలకుండు నని తలంచి సత్వ రము లేచి చేతియం దా మాణిక్యమును బట్టుకొని యుదయసుందరి సమీపమున కేఁగి యామె హస్తమును మణిచేఁ బ్రకాశించు నిజకరంబున గట్టిగా బట్టుకొనెను.


గీ. మణి శరీరము సోఁకినమాత్రముననె
    మూర్చవిడనాడి కన్నులమూఁత విప్పి
    లేచి యాలేమ కాంచెను లీలఁ దనదు
    కరము గ్రహించియున్న భూకాంతు నెదుర.

గీ. వానిని మనోధినాధునా వనిత యెఱుఁగ
    నెడద ననురాగరసమెల్ల నెసక మెసఁగె
    దాని తెఱఁ గిట్టిదని చెప్పఁ దరముఁగాదు
    హరిహరహిరణ్యగర్భాది సురలకై న.

గీ. నవకటాక్షబిసంబుల నువిద తృషిత
    యట్లె వానిరూపామృతం బానఁ దొడఁగె
    నంగజాగ్ని వాడినదాని‌ నవనినాధుఁ
    డడరి నిజసాంద్రృష్టులఁ దడుపుచుండ.

గీ. వారి నూత్నసంయోగోత్సవప్రమోద
    లోలములునై యపాంగవిలోకనములు
    గలియ నొండొంట నెదుర రాగంబు హెచ్చి
    రాకపోక మొనర్చె హృద్రథ్యములను.

అప్పుడు వారు మదనశ్రమజలంబున మంగళస్నానము లొనర్చి మణిసనా ధంబగు కరంబునఁగరంబు గీలించుకొనియుండి పార్శ్వంబులఁ దిరుగు ద్విజోద్ఘోషంబు వేదమంత్రస్వనంబుగాఁ బాణిగ్రహణోత్సవం బందిరి.

ఆ సమయంబున జలోర్మిశిఖరశీకరనికరంబులును, తరులతా ప్రవాళకుసుమంబు లును గాలిచే వారి సమీపమునఁ బడి జలవనాధి దేవతలు వధూవరులపై నభినందిం చుచుఁ జల్లు సేసలవలె విలసిల్లెను. అట్టి యుత్సవంబున నుదయసుందరి నెమ్మేనఁ జెమ్మటలు గ్రమ్మి గగుర్పాటు లొదవ శరీరము గంపింప సిగ్గుచేఁ దలవంచుకొని మందహాస భాసురముఖారవిందయై, యోహో? నన్ను విడిచిపెట్టుఁడు. విడిచిపెట్టుఁడని మృదుమధురభాషణంబులఁ బలుకుచుఁ జేయి లాగికొనఁ బ్రయత్నించెను. రాజోత్త ముండును సహర్షుఁడై మందస్మితం బొనర్చు ననురాగ మిగురొత్తనర్మ సందర్భ మున నామె కిట్లనియె.