పుట:కాశీమజిలీకథలు-12.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

234

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

శృంగారరసమునకుఁ బ్రాతమై, మదనార్తి యనువ్యాధివలనఁ దెల్లనైన చెక్కులుగలిగి తారావళి నాలింగనము జేసికొనుట కెదురువచ్చుచున్న యుదయసుందరి గనం బడెను.

ఆమెంగాంచి చమత్కారముగా శిరఃకంప మొనరించుచు నోరా ! తారావళి మాటలు యధార్థములే యైనవి. ఈ మృగాక్షి నిక్కముగఁ ద్రిభువనలక్ష్మికి సీమంత రత్నమే ! ఈ మణిని నాయెదం దాల్చెదంగాక. కుమారకేసరి చెప్పినదానికన్నఁ జిత్రపటమునఁ జూచినదానికన్న మిన్నగ నీ మోహనాంగిరూపం బొప్పియున్నది గదా !


గీ. వనజగర్భుఁడు రూపసర్వస్వ మీమె
    యందు నిక్షేపముగఁ జేసె నని తలంతుఁ
    గానిచోఁ గార్ముకముదాల్చి కాముఁ డేలఁ
    గాచియుండంగవలయు రక్షకునిలీల.

గీ. లక్ష్మి యామెయై హారాద్యలం క్రియాతి
    వైభవమునకు న న్నధీశ్వరునిఁ జేసె
    నీమెఁ గన నాదుకన్నుల నెసఁగు హర్ష
    జలకణంబులు ముత్తెంపు సరులుగాఁక.

చ. లలన వినిద్రచంపకదళద్యుతియం దతిలీనమై మనో
    జులసదిషుప్రహారముల శోణరుచిం గను మన్ననంబు గెం
    పొలయ విచిత్రవర్ణముల నొప్పుచుఁ గాంచనభూషణంబునన్‌
    గల తరళంబువోలెఁ గడకన్‌ విలసిల్లునటంచు నెంచెదన్‌.

ఔరా ! విధివిధానము ! ఔరా ! కర్మపరిణతిప్రభావము ! ఔరా ! సంసార

వైచిత్ర్యము ! ----------- వనవాసక్లేశ మనుభవించుచుండుటయే యిందులకుఁ దార్కాణము. ఈ యరణ్యమధ్యంబున నామె యెందునిమిత్తము జేరియున్నదో తారా వళి కీతురఁగరూపమేమిటికిఁ గలిగెనో నే నీ చెట్టుచాటుననుండి వీరిమాటలవలన సర్వము నెఱింగెదంగాక యని నిశ్చయించి యట్లు పొంచియుండెను.

ఉదయసుందరియను జిరకాలమునకుఁ దలవనితలంపుగాఁ బ్రియసఖిం గాంచుటవలనఁ గలిగిన మహానందంబున నెదురుగాఁ బఱువెత్తుకొనివచ్చు తారావళి నధికవేగంబునఁ గలసికొని గాఢముగా నాలింగనము జేసికొనెను. ఆమెయును విస్మ యోత్సుకయై ప్రియసఖి యెదపైవ్రాలి బహువిరహ దుఃఖభావమునఁ గొంతతడవు మైమఱచియుండెను. బిదప నిరువురును గటి మి. పదిన ( ఎలిప్పుడున ర్చన “యుండ

చెను. త్‌ నవ్య లౌాంత సాడు ఫట్టునంగవా ఎముక స అలు రుం యుంటుంది... ఆలిఎవచ్చు