పుట:కాశీమజిలీకథలు-12.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వానుని గర్భాండకము విధంబున బ్రకాశించుచు రవి దివంబుననుండి దానికి మిగుల సొగసుగూర్చుచున్నాఁడను నీసున ధరణికిఁగూడఁ దానుండి యందమును గల్పింతునని వచ్చిన మచ్చున నొప్పుచు, నాసన్నవిటపంబులు స్వచ్చమైన తనయందుఁ బ్రతిబింబిత ములై గనంబడుచుండఁ దమాలశాఖాంధకారమున మలినమైన యా శాముఖంబును బహుదూరము బ్రసరించు నిజకరప్రదీప్తిని క్షాళన మొనరించుచు, సర్వత్రవ్యాపించు చున్న నిజతేజోరాశిచే జగములకెల్ల నేకభూతాత్మకత్వంబు నాపాదించుచు, నత్యంత నిర్మలమై యతిమనోహరంబై ప్రకాశించుచున్న మాణిక్యమొకటి గోచరమయ్యెను.

దానింజూచి విస్మయంబందుచు నల్దిక్కులు బరిశీలించి యందెవ్వరును లేకుండుట దృఢపరచుకొని 'ఆహా ! ఈ యపూర్వమాణిక్యి మెక్కడిది ? ఈ చెరువు గట్టున కెట్లువచ్చినది ? ఎచ్చటినుండిపడి యిట్టి దుస్థితి పాలయ్యెను ? అనంతమరీచు లచే నప్రతిహతములగు సహస్రకరములతో నొప్పుచున్నను రాత్రులయందుఁ గాంతి వహింపఁజాలని ద్యుమణిని నిదియతిక్రమించుచున్నది. నిర్మలత్వమునఁ గౌస్తుభమాణి క్యమును నతిశయించుచున్నది. నిష్కోపత్వంబున మునీంద్రులకును సపగతత్రాసత్వం బున సురలకును జిత్తములయందు స్పర్దను బుట్టించుచున్నది. దీనికాంతిచే విజితమై సిగ్గుపడి కౌస్తుభంబు హరివక్షస్థలంబున వనమాలాపగూఢమగు నసితప్రబాంధకారమున నడఁగియున్నది. చింతామణి దీని సామత్యం బొందఁగోరి దానవ్రతంబున నభీష్టసిద్ది యగునని యెఱింగి యర్దులకుఁ గోరినదెల్లనిచ్చు ప్రవృత్తియందున్నది. ఇతరములగు మణులు ప్రభాపరాభవభయంబునఁ గొన్ని యగాధమగు నంబోధిమధ్యమం దడగి యున్నవి. కొన్ని రోహణాద్రి నాశ్రయించి మీఁద మన్ను గప్పుకొని యదృశ్యములై యున్నవి. కొన్ని రసాపలమునఁ బ్రవేశించి ఫణీంద్రఫదాపంజరముల నధిష్టించి యున్నవి. ఇట్టి యుత్కృష్టరత్నము నెవ్వడైన స్నానార్ధ మిచ్చటి కేతెంచి మరచి పోయెనేమో ? అంబరమున విమానముమీఁద సంచరించు దివ్యునిమణి యిందుజారిపడె నేమో ? ఏ వన్యజీవనమైన నే పక్షియైన దీని నెటనైన నపహరించుకొనివచ్చి యిందు విడచిపోయెనేమో ? తుమ్మెదలుమూఁగు పరిమళ ముండుటచేతను నందందు సింధూర రేఖ లుండుటవలనను నియ్యది సౌరభ్యసంభృతాంగవయవ సంగితంబగు నలంకరణమై యొకరమణీమణి విభూషణమని తలంతును అయినను దానిందెచ్చి పరిశీలించెదంగాక యని లేవఁబోవు రాజు ముందర నయ్యశ్వఖురప్రహారవేగంబున నమ్మణి యెగిరివచ్చి పడెను.

340 వ మజిలీ.


అయ్యశ్వము మణిస్పర్శాప్రభావంబునఁ దోడనే తురగరూపమును విడచి జటావల్కలోపవీతములుదాల్చిన తారావళియయ్యెను. పుండరీకుండును నట్టిప్రభావము గల మాణిక్యము దనముందుఁ బయట దిలకించి యేమి‌ యీ యింద్రజాలమని యక్కజ