పుట:కాశీమజిలీకథలు-12.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

విచిత్ర సమ్మేళనము కథ

231

మార్జనం బొనర్చుచు విన్న మాత్రముననే తాపోపహారకమై చూచినంతనే తృష్ణా హారంబై నీటియేనుఁగునకునైన నంతుతెలియనిదై యలలకైనఁ దుని తెలియనిదై యపార జలాకరంబగు కమలాకరంబొండు గనంబడెను.


మ. నవనాళీకమనోజ్ఞవీజనములన్‌ వశ్యుండునై వేడ్క గం
     ధవహోద్యత్తులితంబునైన నవగంధంబంది రోలంబుకుం
     డు వరామోదరనప్రమత్తుఁడయి తోడ్తో పద్మినీలక్ష్మి మ్రో
     ల వికారాతిరవంబునన్‌ దిరుగులీలన్‌ గ్రామ్యజారుం డవన్‌.

అట్టి సరోవరమునుగాంచి యిట్లు వితర్కించుకొనెను.

చ. తిరుగ నగస్త్యమౌని యరుదెంచఁగ వానికిఁ భీతిఁ జెంది సా
    గరములు మూఁడునాల్గు గటకన్‌ వణకూర్ములఁ గానిపింప నీ
    సరసిగభీరగర్భమున సైరతఁజేరఁగఁబోలు దీరమం
    దొరసెడి ఫేనపిండమిష నొయ్యన వింధ్యకు వృద్ధిఁగూర్చుచున్‌.

ఇట్లు తలంచుచు సంతోషాదరస్వాంతుండై భూమీంద్రుండు వడిగఁ దత్తడి నుండిదిగి దానిపైనున్న జీనుఁదీసి కడిగి నీర్వెట్టి తీగెలలో బందమువైచి నవహరిత దూర్వాంకుర మనోహరంబగు నా పరిసరంబున స్వేచ్చగాఁ దిరుగ చ నయ్యశ్వమును విడచెను. పిమ్మటఁ దానును తురగీఖురశిఖరఖండితాధ్వధూళి దూసరమగు చర్గణద్వంద్వ మును గడిగికొని యంబుజాదిజలజకుసుమంబులఁ గోసితెచ్చి మధ్యాహ్నికదేవపూజా దుల నిర్వర్తించెను పిదప లేదామరదళంబులను దీరతరులతాఫలంబులను భుజించి తరు చ్చాయాతిశీతలంబగు జలంబుద్రావి సమీపమున ననేకశాఖోపశాఖలతో నొప్పుచున్న తమాలవృక్షచ్చాయయందు విశ్రమించెను.

అం దుపవిష్టుఁడైయుండి యా వాసరము దలంపునకువచ్చుటచే దాని కొఱకు జలావతరణమార్గంబులఁ దటతరుశిఖరంబుల లతాంతరంబుల గుల్మసంధుల కందరదలీముఖంబుల దృష్టుల నిగుడించి విమర్శింపఁదొడంగెను. పిమ్మట నిట్లు దలంచు కొనెను. ఔరా ! దుష్టమగు నావనచరము నాకెచ్చటను గనుపింపదయ్యెను. ఈ యరణ్యంబున మనుష్యసంచార మున్నట్లు గోచరించుటలేదు ప్రాణులు నివసింపఁదగు ప్రదేశము లేశము నిందుఁ గన్పింపదు. ఈ దుర్వనంబున శ్వాపదంబులుగూడ సంచ రించుచున్నట్లు పొడగట్టుటలేదు. నేనిందుండ నేమిటికి ? కుమారకేసరిప్రభృతు లెందు న్నారోగదా! నన్ను వా రెట్లనుసరించి రాఁగలరు? నాకొఱ కెచ్చట వెదుకఁగలరు ? 4). నెట్లు న ర్థించుచున్నిటో * సరసచూర్వాహార "స? తిరిగి పోయెగంగాం యని తలంచి ఎలయండదు .పఏరుపుదీవ వగిస సూరంభగ