పుట:కాశీమజిలీకథలు-12.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

225

అట్టి యుత్కృష్టవసంతసమయంబునఁ బుండరీకరాజేంద్రుండు సర్వదా యుదయసుందరినే ధ్యానించుచు మదనతాపంబునఁ బొగులుచుండెను. ఒకనాఁ డతఁడు ప్రియవయస్యుండగు కుమారకేసరింగూ ప్రమదావనంబున విహరించుచు నొకచో నక్షివిక్షేపంబున ముందుజూపుచు వాని కిట్లనియె. సఖా ! ఆకాసారతీరంబున నీక్షిం పుము.


ఉ. ఆనళినీవనంబున నితాంతము గాంతనుబాసి విభ్రమా
     సూనమనఃప్రవృత్తిని మనోజమహాగ్రహమేచఁగాఁ బ్రలా
     పానుగతుండునై యళుఁ డహా ! యదె తమ్మిదుమారమూని పె
     న్దీనత శూన్యమందచటఁ ద్రిమ్మరు బంభరడింభకాళితో.

గీ. కేళికావనసీమ నీక్షింపు మదిగొ
    ప్రధిత పున్నా గపుష్పపరాగమెల్ల
    నరయ గంధోపలక్షోదమట్లె యువక
    హృదయముల నంగజాగ్ని దీవింపఁజేయు.

గీ. మలయమారుతడోలిక నలరి మొదలు
    విడచు ఘనరేణుధోరణి వెలయుచున్న
    చూతమంజరి క్రకచికఖాతి నహహ
    విరహుల మనంబులనునెల్లఁ దరుగఁదొడఁగె.

ఇట్లు మదనోన్మాదుండై పలుకుచున్న యా రాజేంద్రుని మాటల నాలకించి కుమారకేసరి డెందంబున నిట్లు తలంచుకొనెను. ఔరా! ఈ మహారాజిప్పుడు మన్మధ హతకునకుఁ బూర్తిగా వశ్యుఁడై యుండెనుగదా! ఇచ్చటనుండి వీనిని వేఱొకచోఁటికిఁ దీసికొనిపోవుట సాధ్యముగాదు. మఱియు నిట్టిప్రదేశమును విడిచిపోయిన విరహార్తుఁడగు వీన బాధ తగ్గనేరదు. కావున నిచ్చటనేయుండి వీనికిఁ గలిగిన మన్మధవ్యధ యేయుపా యంబున నివర్తింపఁబడఁగలదో యర సెదం గాక యని ముందుజూచి ససంభ్రమంబున ఱేని‌ కిట్లనియె. దేవా! అటుచూడుము వనవీరుఁడను కిరాతరాజువలనఁ నెచ్చటనుండియో సంపాదించికొనిరాఁబడుచు దారకుఁడు గళ్ళెమును బట్టుకొని నడిపింప జీనుగట్టఁబడి, సర్వర్తురాజగు వసంతుఁడుబంపిన కానుకయట్లు దిక్పాదులుకు నీవు నడచుట కిష్టపడక యొసంగినదానివలె ననన్యయోగ్యమగుటచే దేవేంద్రునివలనఁ నొసంగఁబడిన యుపా యమునవోలె, నీకుఁ దగినవాహనముగ విధాతచేత నిర్మింపఁబడినవోల్కె నొప్పుచుఁ బ్రభూతవేగంబున రూపొందిన వాయువురీతి, సాక్ష్కాత్కరించిన మనస్సుగతి, రూపాంతరోత్పత్తివిధ౦బున నలరారుచు, సర్వాంగసుందరమై, శుభలక్షణలక్షితమై యదృష్టపూర్వమగు మనోహరాకారమున మించు నాయశ్వ శ్రేష్టమును దిలకింపుమని కుమారకేసరిపలుక‌ నారాజేంద్రుండు విస్మయంబున నావైపు దిలకించెను.