పుట:కాశీమజిలీకథలు-12.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మించెను. స్మరానలదందహ్యమానుండగు భూమండలా ఖండలునకుఁ జిత్తసంతాప శమనం బొనర్పఁదగు పద్మకాననమందలి యివకఁ బోఁగొట్టుచు నేనుండుటఁ దగదని శిశిరంబ దృశ్యమయ్యెను. మలయగిరి శిఖరసరసీతరంజల సంపర్కంబునఁ జల్ల నైన పిల్ల వాయువులు వ్యజనోపకరణంబుగ గ్రహించి యవిరళవకుళకుసుమకోశము లందలి మధురసజలంబును నార్ద్రోపకరణంబుగఁబూని వికలదతివిశది సిందురారసంభృతాసల్ప తరపరాగంబు స్వేదాపహరంబగు కర్పూరచూర్ణంబు డంబునవహించి నవీన కోమల తరుప్రవాళ నికరంబును మృదుతల్పంబుగఁ గల్పించి సమయమునకుఁ దగినరీతి నీ రాజేంద్రున కుపచారముల నొనరింతునని వసంత మేతెంచెను.


మ. అతిసౌఖ్యాస్పదమౌ వసంతమునఁ జూతాంకూరమే మన్మధా
     యతబాణంబయి మానినీవిమలశీలాకర్షమున్‌‌జేసి, యు
     ద్దత రాగాంధులఁ జిత్తముల్‌ గలచి నిత్య౦బున్‌ వియోగిన్య సు
     ప్రతతిన్‌ బుచ్చుచుబాంధులన్‌ గెడపుచున్‌ బాధించుముల్లోకముల్‌.

మఱియును,

ఆ. వె. ఇంపుమీఱు నామ్రసంపదలను మించు
        నవ్వసంతసమయమందుఁ గలుగు
        పికరుతంబుదోచె విరహుల మదినాటు
        స్మరుని బాణశల్య శబ్దమట్లు.

త్రిభువనంబుల కానందమును‌గూర్చు నట్టిపసంత సమయంబున మలయ కామినీ కర్ణపూరారవిందకోశంబులం బ్రవేశించు నుత్సాహంబున నలసి పయోధితటా రామంబుల విశ్రమించుచు తా మపర్ణీ తరంగడోలికల శిశువువలెనే గేరింతములుగొట్టుచు గావేరీకూల లతాగృహంబులయం దతిధులవలెనే నివసించుచు గోదావరీజల తుషారము లతో బధికులవలెనే కరసికొనుచు, మృగమదమషీలిఖితంబులగు పాండీకపోలవ్రతంబుల బండితులవలెనే విమర్శించుచుఁ, గంతలీధమ్మిల్ల వేలీగతంబులగు కుసుమమంజరుల మాలికాకారుల విధంబున సరిఁజేయుచు, మన్మధనిధానములగు నాంధ్రసీమంతినీ స్తనకలశంబులసు సిద్దులవలెనే బయల్పెట్టుచు, పున్నాగమధురసస్వేదంబులగు మహా రాష్ట్ర కుటుంబినుల యూరుస్తంభంబుల మల్లురవలెనే కలయఁగలుపుచు, పరిమళ మిళితాళికవచంబులఁ జెలంగులాట లీలావతుల వళులను వీరభటులవలెనే యెగఁబ్రాకుచు గర్ణాటనారీకుచపత్ర కస్తూరికాప కిలపధంబున మందగమనంబు నందుచు త్రిలింగ తరుణీకురుల వనశీతలచ్చాయల సేవించుచు సవిభ్రమాభీరభామినీముఖా మోనంబునఁ బరిమళించుచు, జందనగిరిపరసరోద్యానమండలంబునఁ జలించి గుసుమలతికలకు హస్తకాభినయానాదుల నేర్పు భరతాచార్యునివలె నలరారుచుఁ జల్లనిపిల్ల వాయువులు దక్షిణదిగంగనాశ్లేష మిళితతర్పూరసౌరభంబుతోఁ బ్రసరించుచుండెను.