పుట:కాశీమజిలీకథలు-12.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

223

విడచుచు నారాత్రియెల్ల గడపినది. ప్రభాతంబుననే లేచి పుష్పావచయము నెపంబు,న గుసు... వాటికకుఁ బోయెను. కాని యామె తిరిగిరాలేదు. ఉదయసుందరీ వియోగ దుఃఖమున నొంటరిగా నెచ్చటికింబోయి యుండెనో యెఱుంగజాలక మే మామెకొఱ కం దందా దినమంతయును వెదకితిమిగాని యామెజాడ యేమియును దెలిసినదికాదు. తమతోఁగూడ జెప్పకపోవుటచేతఁ “బూర్వపరిచితుఁ డెవఁడైన గనంబడి యామెను నిజనిలయంబునకు సగౌరవంబుగ నాతిథ్య మొసంగ దోడ్కొనిపోయి యుండవచ్చును. మాతోఁ జెప్పకయె పోవుటకు దారావళి యవివేకురాలా యేమి? ఉదయమునఁ దప్పక తిరిగిరాఁగల” దని‌ తలంచితిమి. కాని యట్లు రాలేదు. నేఁటి కామె యరిగి మూఁడు దినములై నది. ఉదయసుందరిని విడచియున్న నిన్నుఁజూడజాలక యామెను వెదకి తెచ్చుటకు వెనుకఁ దనయింటినుండి యెట్లు వెడలివచ్చినదో యట్లే యిపుడును బోయి యుండును. కావున మీరామెకొఱకు విచారంపఁబనిలేదు. ఆమెను వెదుకఁ జూచుటవలన నిసుమంతయును బ్రయోజనములేదు. ఆ యన్వేషణ ప్రయాస ముదయసుందరికొఱకు బడుట యుక్తము. తారావళియును నుదయసుందరిని వెదుక నెల్లెడలఁ దిరుగుచుఁ దనంతట తానేరాఁగలదు అని యిట్లు విశ్వభూతి యాదేశ మెఱింగించిఱేని సమ్మతింప జేసి వాని నాశీర్వదించి సంతసంబున‌ నిజవాసంబున కరిగెను.

పిమ్మట నా రాజేంద్రుండు తారావళి మాయమగుటకు విస్మయంబందుచు నుదయసుందరీ సంస్మరణంబు మాత్రంబుననే మదన మూర్చితుండగుచు స్త్రీరత్న ఫలితమగు దన యాశాకల్పలతికకు మూలమై చెంతనున్న కుమారకేసరి నమృతరసావ నేకశుభగంబులగు చూపుల నీక్షించుచు నిట్లనియె మిత్రమా! తారావళి యెందేగి యుండును ? ఏ మార్గంబునఁ బోయియుండును ? అమె నిక్కముగఁ బ్రియసఖి నీ భూమండలంబున వెదకుటకే యరిగియుండునా ? మార్గమధ్యమం దెందైన నపాయము సంభవింపదుగదా ? ఏమిజరగియుండునని యడుగుచు నంతలో నీకా యుదయసుందరి యెచ్చట గనంబడెను? ఎట్లు చూచితివి? అందేమి చేసెను ? ఏమని పలికెను ? ఎచ్చటనుండి యేతెంచెను? ఏ కులంబునఁ బొడమెను ? ఎచ్చట దిరుగుచున్నది ? అని ప్రశ్నించుచు జెప్పినది చెప్పినట్లు వినినది వినినట్లు తెలిసినది తెలియనట్లు మఱల మఱల నడిగినదే యడుగుచు హృదయానువర్తియగు గుమారకేసరివలన మాటిమాటి కా వృత్తాంతమును వినుచున్నను మరచుచు నా రాజేంద్రుండు కొన్ని దినంబులు గడ పెను.

మేఘముల నలుపును బాపుచు నేను కూడదన్న హరిణలాంఛలుండు విశేష దీప్తింగాంచి నిజకరంబుల ననంగశరాహతి నవసియున్న యీఱేని బాధింపఁగలడని శరత్కాలము గతించెను. నిరంతరము నుదయసుందరీ థ్యాననియతుఁడైయున్న యా


నియమంబునకుఁ క్రొత్తవరిచేలయందుఁ దిరుగు క్రౌంచపక్షుల కఠని


నేనుండి యంతరాయము గలిగింపరాదని హేమంతము నిష్క్ర