పుట:కాశీమజిలీకథలు-12.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

221

నకుఁ దోడ్కొనిబోయినచో నాకెట్లు గోచరముకాగలదు. అట్లు నిక్కముగఁ బితృ గృహంబునకుఁ గొంపోబడియున్నచోఁ దారావళి సహాయమున్నను నా కామె లభింపఁ గలదని యెట్లూహింతును ? ఇంతకు నామె యెచ్చటనున్నదో తెలియక నేనేమి చేయఁ గలను? ఎచ్చట వెదుకఁగలను? మనుష్యులకు నరలోకమును దాటి పోవుటకు శక్తిలేదు గదా? ఎల్లలోకములఁ దిరుగశక్తిఁగలవారు సురసిద్ద విద్యాధరోరగయక్షరాక్షసులని యావాక్యాంతమందలి రాక్షసశబ్దమున స్మృతినభినయించుచు బాగు బాగు చక్కఁగా జ్ఞప్తికి వచ్చినది మదీయ విక్రమైకలభ్యమిత్రుండగు మాయాబల నిశాచర వీరుండు కలఁడుగదా? వానిచేత నాయిందుముఖిని నెల్లలోకముల యందును వెదకింపవచ్చును. దీనికై యింక యలజడిం బడనేమిటికని తలంచి నిశ్చలచిత్తుఁడై యామాయాబలుని ధ్యానించెను.

అంతలో సౌమ్యుఁడగు విప్రుని యాకారంబున మాయాబలుం డేతెంచి దేవా ! నీ వెవనిని ధ్యానించితివో యతఁడే నీ ముందున్నవాఁడని యెఱుంగుము. ఎందుకొఱకు నన్ను దలంచితివో యా పనికి సత్వరమ నియోగింపుము. బ్రహ్మాండ శిఖరము మొదలు బాతాళము వఱకును దిరిగి యెట్టి దుర్ఘటకార్యమునై నను క్షణములో సాధింపఁగలనని చేతులుజోడించుకొని నమస్కరించుచు ఱేనియెదుట నిలువఁబడి యుండెను.

అంత నా రాజముఖ్యుండు జిత్రగతమైయున్న యుదయసుందరీ స్వరూప మును జూపించుచు వయస్యా ! ఈ యాకృతిఁగల లలనారత్నము త్రిభుజవనంబుల నెందున్నఁదో వెదకిరమ్మని యాదేశింత నానక్తంచరవీరుం డతిరయంబున నంతర్హి తుండయ్యెను. వాఁ డరిగిన పిదపఁ బుండరీకుండును మాయాబలుండు తప్పక యా వేదండయానను గనుంగొనిరాఁగలఁడను నాశతో నాదినమును గడపెను. మఱియు నుదయసుందరియందలి గాఢానురాగంబుకతంబున నతం డంతరంగమున దశవిధ విరహాస్థలపాలగుచు నిట్లని వితర్నించుకొనెను.


మ. చలియో వేడియో భూమిదాటునెడ విస్తారంబుగాఁబుట్టి పెన్‌
     గలతన్‌ బెట్టఁగ నూత్నబందిగమునన్‌ గాడాంబుగా నాయెడన్‌
     గల మోహమందున మన్మధాస్త్రవిహతిన్‌ గాయంబునుగాంచి, గా
     సిలి యాకాంత లతాంగమక్కటకటా! జేటందెనేమోగదా ?

అయ్యో ! అశేషశుభసంపదల కాస్పందబగు నా నారిశిరోరత్నము నశించె నని సంశయించుట ప్రమాదముగదా ?


మ. సతిపై కోర్కెఁజరించు నాహృదయా మాశ్యామాతితారుణ్యసం
     భృతసర్వాంగయుతాంగజోత్సవలసద్రీతిన్‌ నితంబోదరా