పుట:కాశీమజిలీకథలు-12.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

కొలఁది నా హృదయానుతాప మభివృద్ధి జెందుచుండెనని పలుకుచు విచారోద్రేకంబున నింకేమియు మాటాడఁజాలక మిన్నక గన్నీరు విడువఁదొడంగెను.

తారావళి దుఃఖమును గాంచి పుండరీకుండును దన కుదయసుందరియందుఁ గల యనురాగంబుకతన బుట్టినవిచారము నెడద నడంచుకొని దీర్ఘ నిశ్వాసంబులవిడుచు చుండఁ దిలకించి కాలోచితంబుగ విశ్వవిభూతి వాని కిట్లనియె వత్సా ! నీవేల నట్లుం డెదవు ? సంవియోగంబున నతిచంచలహృదయైయున్న యామె చిత్రప్రదర్శనంబున విచారాంబుధి మునింగియున్నది. ధీరోదాత్తుండవగు నీవు ముందుచేయఁదగిన కృత్య మేమో యెట్లాయుదయసుందరిని గనుంగొనవలెనో, యిందుల కెవరిసహాయము గావ లెనో, యెచ్చటెచ్చటి కెవరెవరిని బంపించవలెనో, యాలోచింపుము


చ. సకలసముద్రముద్రితవిశాల ధరాతల చక్రమందునన్‌
    బ్రకటమహాహిలోకమున స్వర్భువనంబున‌ నెందునున్నఁ గొం
    కక వెదకించి యాతరుణిఁగాంచి రయంబున నిందుఁదెచ్చి ము
    ద్రికగతి హస్తమందుఁ గడుప్రీతిధరింపుమ ధర్మసిద్ధికై.

మర్త్యలోకమం దవతరించిన సువర్ణావాహనుండవగు నీరసాధ్యమెందును లేదు. కావున సత్వరమ యిందుండిలేచి పౌర్వాహ్ణికకృత్యంబులనెల్ల నిర్వర్తించు కొనుము వేళ యతిక్రమించుచున్నది అని తారావళి మొగంబై తారావళీ ! నీవిట్లేల యింకను పరితపించెదవు ? మహారాజు స్వయముగా నామెను వెదకించుటకుఁ బ్రయత్న మొనరింపఁగలఁడు విధికూడ వీనికి వెఱచును. కావున నవ్విధి యనుకూలుఁడై యచిర కాలముననే మీ కాయుదయసుందరిని సమకూర్పఁగలడు. అని విశ్వభూతి పలుకఁ దారావళి స్వస్థచిత్తయై పూజ్యురాలవగు నీమాటలు యధార్దములగుగాక యని వచించి రాజుతో వాని నివాసంబున కేగవలెనని దలంచియు నట్లొనర్చుట గౌరవలోపమనియెంచి విశ్వభూతి ననుసరించి పోయెను.

రాజును నిజనివాసంబున కేగి యధోచిత కాలకృత్యంబుల నిర్వర్తించు కొనుటయం దనాకులుఁడై యున్నను గుసుమశరశిలీముఖ పరంపరాఘాతముచే డెంద మునఁబడిన బెద్దగాయము తారావళినయన జలబిందువుల నీరుపట్టి బాధించుచుండ నిట్లు దీర్ఘ ముగ విచారింపఁ దొడంగెను. అన్నా ! ఆ మోహనాంగి నెందుఁగనుంగొన గలను ? సౌధశిఖరంబున నిద్రించు నామెను దద్రూపమోహంబున నెవ్వఁడో యపహ రించియుండును. అట్టి యువతీరత్నము నీక్షించి యెవఁడు గైకొనక విడిచిపెట్టఁ గలడు ? నిఖిలసులక్షణలక్షితమగు నామె కళ్యాణరూపమున కెన్నడు నపాయము గలుగనేరదు. ఈ బ్రహ్మాండగర్భమున నామె యెచ్చటనున్నదో యే యపాయంబుఁ దెలిసికొనఁగలను ? ఆమె జనకుండగు శిఖండతిలకుండు తదన్వేషణంబునకై పెక్కు మంది దూతలంబుచ్చెనని వింటినిగదా ? వా రామె నెందైనఁ గనుంగొని పాతాళము