పుట:కాశీమజిలీకథలు-12.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

218

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వికసితనదకుసుమలాటికలఁ జెలంగు మాలినీలతా సీమంతసిందూరధోరణి విపంచిత మహోత్సవాచారము లీల భాసిల్లెను. క్రీడాసరో‌వరంబులఁ బుండరీకమును జెలఁగి యుండెను. సహజశీతలంబగు ప్రభాతమందమలయానిలయంబు హృదయంగమమై యొప్పియుండెను. కాలక్రమంబున గతించిన నిశీధివీకపాలములీలఁ దెల్లనగు హిమాంశు బింబమస్తశైలకూలంబునఁ గూలిపోయెను. అంత--


ఆ. వె. ఉడుగణంబు విడువకుండె నిప్పటికైన
        భృగుగురుప్రధానవిబుధుల నని
        తీవ్రకోపమూను దినకటాక్షచ్ఛాయఁ
        బుట్టై నరుణ రేఖ పెడుపుగొండ.

పిమ్మటఁ బ్రభాత లక్ష్మీసింధూరతిలకంబులీల నంబరంబున నర్కబింబము బొడసూపెను.


గీ.‌ సర్వజగదుగ్రరోగముల్‌ సంహరించు
    సూర్యభగవానుఁ డుదయింప జుక్కలనెడి
    కుష్టరోగంపుమచ్చ లకుంఠగతిని
    నంతమొందెను నంబర మందునెల్ల

అంత దిక్కు నెల్లనహస్కరుకిరణసహస్రంబులఁ బ్రకాశించుచుండెను. జలాశయంబులఁదమ్ములు వికసించుచుండెను. నికేతనంబులఁ దల్చంబులనుండిలేచిన మానినుల కటాక్షములు విలసిల్లుచుండెను. అట్టి ప్రభాతసమయంబున వందిమాగధుల స్తోత్రపాఠంబులను, మంగళతూర్యనాదంబులను బుండరీక రాజేంద్రుండు నిద్ర మేల్కొని శయ్యనుండి లేచివచ్చి ప్రాతఃకృత్యముల నిర్వర్తించుకొని ప్రియమిత్రుం డగు కుమారకేసరిం బిలిపించి వానితో రాత్రిజరిగిన వృత్తాంతమెల్లఁజెప్పి యుచితరీతిని దరుణేందు శేఖరు నతిభక్తినిత్యానుక్రమణికంబుగ నర్చించెను. మదనమోహితుండగు నతండు రాత్రిజరిగినదియెల్లఁ గలలోనివార్తవలెఁ దలంచుచు నిజమెఱుంగ వెండియుఁ దారావళిని దర్శించి యామెకుఁ జిత్రపటమును‌ జూపించి యుదయసుందరీకథావర్ణన రసైక సౌఖ్యం బనుభవించుచు ననంగమార్గణోదగ్రవేదనాదుఃఖమును బోఁగొట్టుకొన నెంచి యీశ్వరాయతనవృత్తాంతము నెఱింగించిన కుమారకేసరితో భద్రదంతావళము నెక్కి విశ్వభూతిమఠమున కరిగెను. మఠద్వారప్రదేశమునందే పరిజనులనెల్లనుండ నియమించి తాను గుమారకేసరితో విశ్వభూతి శిష్యవర్గము దారిఁజూపుచుండ లోనికరిగి యందుచితస్థానంబున నాసీనుఁడై యుండెను. వానిరాక నెఱింగి విశ్వభూతి తారావళితో నటకేతెంచి నాఱేఁ డాతపస్వినికిఁ బ్రణమిల్లి యాశీర్వాదములఁ బడసి యామె యొసం గిన కుసుమదామమున వినయంబున గ్రహించెను. పిమ్మట విశ్వభూపతి వచ్చా ! షి ఒఆంపోజ ము న్‌ంచుక యవిష్టమున్నది. దానం వాస నాంతలను అంతవరకు దారావ? మీసన్సి తనుండ్‌ యఖీష్షకథా