పుట:కాశీమజిలీకథలు-12.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

217


గీ. సుదతి నెఱిఁదినకతన సమ్మదరసంబు
   నామెఁ గాంచక కడువిషాదాతిశయము
   రెండును విరుద్ధగతిఁ బ్రసరించి వాని
   నిద్రను హరింపగా శయనించె నతఁడు.

337 వ మజిలి


ఇంతలోఁ దెల్లవాఱెను. అతివికట కుక్కుటకుటుంబ కటురవంబున మేల్కొన్న విలాసవనవిహంగమశ్వ్రేణుల కలకలం బతిశయింప, దేవాలయమందిరంబుల మ్రోగింపఁబడు నవసరవాదిత్ర సమూహధ్వనులు జెలంగ, విబుర్ధసింధురనియంత్ర మునకై హస్థిళారాంతరాళంబులకుఁ గొనిపోఁబడిన శృంఖలాక్వణత్వారరవంబు మిగులఁ, గలళంబులం బితుగఁబడుచున్న క్షీరధారల మూత్కారడంబరం బడరఁగుల కాంతలు దధిమధనం బొనర్పఁ బెరుకుకుండల మధ్యంబునఁ బెట్టి వడివడిగాఁ ద్రిప్పు కవ్వముల ధరత్కారంబు నివ్వటిల్ల, నదీస్నానోపకరణంబులఁ గానక కలవరంపడు శ్రోత్రియద్విజుల కోలాహలంబు బెంపెక్కఁ, బాంధుల ప్రయాణసన్నాహనిస్వనంబతి శయింప, రాత్రియెల్ల మేల్కొనియుండుటచేఁ దూలుచు నిజగృహంబుల కేఁగు యామిక జనులసందడి మీఱ, రతిరస నిద్రాల సవిలోచనలై బిరబిర పూఁదోటలకు బరువెత్తు మాలాకారతరుణుల పదఘట్టనలు మితిమాఱ, నిద్రం జొక్కియునప్రగల్భతర భుజంగ సంఘమును మేల్కొల్పు వేశ్యాంగనల హుంకారధ్వనులు బెచ్చు పెఱుగ, నన్యకాంతా సక్తుఁడై ప్రియుం డరుగ వలవంతంబడి యతం డరుదెంచినతోడనే కలకలఁదేరి ఎదురు వచ్చు మానివతుల సాధువచనంబులు జెలరేగ, గృహజనుల మొదట మేల్కొల్పు పంజరస్థశారికానికరములపలుకుల రొదల ప్రబలమగుచుండ, మిధునవృత్తి నుదీర్ణములై నిద్రాంతోన్మిషితసంస్కారములైన క్రీడాశుకములకలకలంబతిశయింప, బుణ్యపధాను వృత్తులై హరికీర్తనలఁ బాడువృద్దులపాటలసవ్వడి బెంపెక్క ఱుఁగ, ధర్మక్రమాను లగ్నులై దేవస్తుతులఁబఠించు మునిమాణవకో త్తముల సందడి యలరారఁ, గ్రమక్రమ ముగా నిద్రనుండి లేచి ప్రాతఃకృత్యంబులఁ బ్రవర్తించు సకలజనపదాలాపనిస్వనంబు మితిమీఱ, దిగ్ముఖములం దతిపృధుప్రభాటల సముదయోదయంబై శుభమయారంభ సంరంభమై ప్రభాతం బతిమనోహరంబయ్యెను.

అప్పుడు దినరాజలప్రవేశంబునకు జేయఁబడిన సముచిత శుభసత్కారముల లీలఁ బ్రతిగృహంబుముంగిటను గలయంపులుజల్లి మనోహర రంగావళులు దీర్పబడి యుండెను. సాయంకాలమున వికసించి తెల్ల వారుసరికి తొడిమలపట్టువదలి నేలరాలి యున్న మాలతీకుసుమ నికురుంబమువలన నతిమనోహరంబుగఁ బుడమియెల్ల నలంక రింపఁబడి యుండెను. మేల్కొన్న యన్ను మిన్నల వదన సరోజామోదమునకు

----- మధుకరశ్రేణు లడుగడునకుఁ గట్టఁబడిన తోరణములవలె నలరారుచుండెను.