పుట:కాశీమజిలీకథలు-12.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

211

దేవా! ఉదగ్రశక్తిగలిగి దుర్గమంబుల గమించుటయందును, దుష్ప్రవేశంబులబ్రవే శించుట యందును, దుర్లంఘ్యంబుల దాటుటయందును, నిపుణులై ప్రపంచమం దెల్ల డల సహజప్రభావంబున సంచార మొనర్చుచు మనోవేగంబు గలిగి‌ ప్రసిద్ధి కెక్కిన వీర భటులు గొంద ఱవంతకులజాతులు, గొందరు వాసుకివంశజులు, గొందరు తక్ష కాన్వయసంభవులు, గొందరు కర్కోటక గోత్రజులు, గొందరు కుళికసంతతిప్రభు వులు, గొందరు నీయాది పురుషుఁడగు శంఖపాలుని వంశోద్భవులు, గొందరు మహా పద్మసంతానప్రసూతులు గొందరు పద్మగోత్రసంభూతులు గలరు. ఈ యెనిమిది వంశములయందును బ్రసిద్దులైన భుజంగమభటులును స్వామిహితంబుపొందె సకల లోకంబుల యందును నుదయసుందరుని వెదకుటకు సమర్దులని వచించినవారి నెల్లర రావించి రాజుమ్రోల నిలిపెను.

రాజు వారి నెల్లర పేరుపేరువరుస నాదరించుచు, వారు వెదుకవలసిన యుదయసుందరి చిత్రపటంబు నొసంగుచు, వారి నుద్దేశించి యిట్లనియె. ఓ వీరులారా! మీ రెల్లరును ముందుగా నీ సప్త పాతాళంబుల వెదుకవలయును. పిమ్మట భూలోక మున కేగుఁడు. అందు జంబూద్వీపంబునఁ గదంబ మహావృక్షములచే సుందరమగు మందరగిరియందు గుంజాక్షుఁడును, జంబుద్రుమంబులచే వెలయు గంధమాదనంబున నుత్పలుండును, పిప్పలవృక్షములచేఁ బ్రకాశించు విపులమను మహీధరంబునఁ దీప కుండును, న్య గోధవృక్షములచే నొప్పు సానుమతియను నగధరంబునఁ గాలినృకుం డును, నలుగురు వీరులును నాలుగు మహాపర్వతములయందును వెదుకవలెను. మరియు నునిషథమందుఁ దమానకుండును, హేమకూటమునఁ గమలుండును, హిమాద్రి యందు గువలయుండును, శ్రద్ధగా నీమూఁడు పర్వతముల యందును వెదుకవల యును.

శృంగవతికిఁ బర్మకుండును, శ్వేతాచలంబునకుఁ బింగళుండును, నీలా చలంబునకు నీలరోచుండును నరుగవలెను. మహేంద్రము మలయపర్వతము, శక్తిమతి, సంహ్యాద్రి, వృక్షశైలము, వింధ్యభూధరము, పారియాత్రము, కన్యాచల మను నీ యెనిమిది కులపర్వతములయందును. బుష్కరాదు లెనమండ్రును నన్వేషించునది. చైత్రరథంబున శిఖండకుండు, నందనంబునఁ దారాక్షుండు, విభ్రాజమందె విశా లుండు, ధృతియందు సితాదరుండు సంచరించుచు, నా నాలుగు మహావనంబుల యందును నల్వురు భటులు వెదకవలెను. మీద నరుణోదమం దొకఁడును, మానసంబున రెండవవాఁడు, సితోదమందు మూఁడవవాఁడును, మహాభద్రమందు నాల్గవవాఁడును, నీ నాలుగు జలాస్పదంబులయందును ఫణాంకుశ ప్రభృతులు నలుగురును వెదక వలెను. భారతక్షేత్రమున దంభోళి పరికింపవలెను. ఇలావృతంబునకు రమసికేతుం డేగవలెను. తక్కినవారు లంకాలకాది నగరంబుల కేఁగునది. శ్రీశైల కైలాసాది