పుట:కాశీమజిలీకథలు-12.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

205

అని పలుకుచు దెలివిదప్పి శయ్యయందు బడిపోయెను. అప్పుడు నేనామె నిశ్చయ మెఱింగి అయ్యో ! ఇదేమి ! ఆధారరహితమై, యచింత్యమై, యపౌరుషే యమై, యచిరోపసాధ్యమై, కడుంగడుదుష్కరమైనట్టి యిట్టిప్రయత్నమును బూనుచున్న దేమి? నేనిప్పు డేమిచేయుదును ? ఎందుబోవును ? ఏ యుపాయమును బన్నుదును ఏ దేవుని బ్రార్దింతునని నిముషమాత్రము జింతించి స్వయం ప్రభోధిత నై నాచిత్త మున కెట్లుతోచిన నట్లొనరింతుగాక, విధివిధాన మెట్లున్న నట్లు జరుగగలదని నిశ్చ యించి యందుల కనేకోపాయంబు లాలోచించుచు దుదకొక నిర్ణయమునకువచ్చి దానిని నిర్వహింపబోయి యతిత్వరితగతిదిరిగివచ్చి సఖీ ! నీ ప్రతిజ్ఞ నెరవేరినది. నీ వల్లభు నితో గలసికొంటివి. ముందు జూడుమని పలుకు నామాటల విని యా యబల చటు క్కున మోమెత్తి నిజస్వరూపము వేఱొక పటమున లిఖింపబడి యాపురుషపాంతికమున జేర్ప పడియుండుట దిలకించి యామెనవ్వుచు నిది యేమని యడుగ నేనిట్లంటి.

దేవీ ! ఏదియో యొకవిధమున నిన్నతని గూర్చుమని కదా నా కాదేశించి తివి. ఈ యుపాయమున నీ చిత్రమూర్తితో ని‌న్గూర్ప గలిగితిని. నే నిప్పుడు విద్ద విజయు డను చిత్రకారునియొద్ద కఱిగి జిత్రకళా నైపుణ్యము దేటపడురీతి నీ ప్రతి బింబమును. లిఖింపజేసి తెచ్చితిని. ఆ పటమును దీనితోగూర్చి చిత్రప్రకారమున మిమ్మిరువుర నిట్లు గలయజేసితిని. ఇందువలన నీ తలంపు పూర్తియైనది గదా ? మరియు నా దొక చిన్నవిన్నపము గలదు. గొప్ప ప్రయత్నముననైన సాధింపజాలని పదార్థమును తొందరపడి కోరుట సమంజసమేనా? నీ కోర్కె నెరవేర్చుటకు దగిన ప్రయత్నమును నేను దప్పక చేసెదను. అంతదనుక నీహృదయంబు దృఢపఱచుకొని వేచియుండు మని వచింప నా కామె యిట్లనియె. సరే. కానిమ్ము ఈరీతి నైన నా ప్రతిజ్ఞ నెఱవేర్చి మిగుల నుపకార మొనరించితివి. చిత్రరూపముననైన నేను నా మనో హరునితోగూడియుండుట దిలకించుచు జీవనములనిల్పికొందు నని బల్కి యాపటమును బ్రాణపదముగ నంతికమున బెట్టుకొని యెట్లో కాలము గడుపుచుండెను.

అట్లనంగతాదుస్సహమున ననేక విరహావస్థలం బడుచున్న యా యన్ను మిన్న హృదయాంధకారమును సాంద్రాంజనచ్చ విగలమేఘములచే దట్టముగ జేయుచు, ననేక వర్ణముల దాల్చిన నింద్రధనస్సుచే నామెకు విచిత్రములగు కోర్కెలం గలిగించుచు, శంఖదళమువలె దెల్లనైన బలాకపక్షులచే నామెకపోలములకు బాండిమం బాపాదించుచు, నగ్నివలె బ్రకాశించు మెరుపులచే నామె మన్మధతాపము నభివృద్ది నొనరించుచు, మధురావిరళమయూర కేకారవముచే పంచమస్వరంబున నొప్పు నామె హుంకారమును దీర్ఘముగ జేయుచు, మరకత మణిప్రదీపులం బరగు పచ్చిక బట్టులం గలిగి, స్వచ్చజలాపూరితములగు మనోజ్ఞపల్వలములు గలిగి చల్లనైన దినము