పుట:కాశీమజిలీకథలు-12.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

203

గలము ? ఇతం డెట్లు నాకన్నులంబడును ? దురాత్ముఁ డగు మరుఁ డను వేఁటకాడు దీపహరిణివలె వీని రూపమును నాకుఁ జూపించి మదీయ నయనసారంగద్వయము నపహరించి చలించుచున్న మనమును గూడ వశము జేసికొనెనుగదా ? ఇందులకు బ్రతీకార మేమో సత్వరము చెప్పుమని తొందరఁబెట్టుచుండ నే నౌరా ! ఈ మత్త కాశిని చిత్త మనంగజాయత్తమై మిగుల యలజడిం బడుచున్నది ఇప్పు డీమెను మారు ధోరణిఁబెట్టి మనమున కించుక విశ్రాంతి గలుగఁజేసెదంగాక యని నిశ్చయించి యామె కిట్లంటిని.

నెచ్చెలీ ! చిత్తమున స్వస్థతం జెందుము. బుద్ధిమంతుల యంతఃకరణము నకుఁ గోచరింపని దేమికలదు ? మానసంబున కగమ్యమును నసాధ్యమును నెద్దియును లేదు. అశరీరుండగు మన్మధహతకునకు లోఁబడి నీవిట్లుండుట దగదు. ఆ పురుషుని నీవు చూడనట్లే తలంచుకొనుమని ప్రబోధించు నాతో మందహాస భాసురల ముఖార విందయై ప్రియసఖీ ! నా మనము నాకే స్వాధీనము గాకున్నది. నా మనోహరు నన్వే షించు భారమంతయును నీమీదనే యున్నదని వచించి యామె దీర్ఘనిశ్వాస మొన రించి యూఱకుండెను.

అప్పటినుండియును మన్మధగ్రహ మామె మనమున నావహించి నిశ్శంక ముగా బాధించుచుండెను. స్మరశరనికరా ఘాతమున నామె మేను గృశించుచుండెను. అనవరత నేత్రవారిధారలవలె నామె యుబలాటము మెండయ్యెను. స్వప్నమునఁ గనం బడిన యా సుందరాంగుని వృత్తాంతములే యామెకు ముచ్చట లయ్యెను. చిత్రపట నిరూపణమే వ్యాపారమయ్యెను. ఆశాప్రసర వినోదములగు మనః ప్రవృత్తులే సఖురాం డ్రయ్యెను. వానిఁగూడు తలంపులే లీలోపకరణము లయ్యెను. కుసుమశరవికారములే క్రీడలయ్యెను, మదనతాప నివారణమున కొనఁగూర్చిన చల్లని మైపూఁతలే సర్వాను గంధాను లేపనంబు లయ్యెను చెమ్మట లార్ప నొనర్చిన కర్పూర విరచనోపచారమే పత్రాంకరచనావిలాస మయ్యెను విన్యస్తసరస బినప్రవాళవలయాదులే దివ్యభూష ణములయ్యెను. మేన నుంపఁబడిన కమలకైరవాదులే కుసుమహారము లయ్యెను. కదళీ దళములచే విసరఁబడిన వాయువే నేపధ్యవిశేష మయ్యెను.


గీ. అతనుపరితాప దుర్దశ యను మహాప
    థంబు నందేగనెంచి యత్తరుణిమిన్ని
    కరములను బెట్టఁబడు బినకంకణముల
    నెపమునను శాంఖవలయముల్‌ నెమ్మిఁ దాల్చె

గీ. ఆమె నిర్మలహృదయాహతాతిపాత
    కమున మరుఁడు లూతాకృమిత్వమును గాంచెఁ