పుట:కాశీమజిలీకథలు-12.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యురగుడో మఱెవ్వడో యెరుంగక యన్వయాచారముల దెలిసికొనక యీ చిత్రపట మందు జూచినమాత్రముననే మన్మధునకు లోనై శృంగారసమున మునింగి చిత్త ముత్తలపాటు జెంద నింద్రియములు స్వేచ్చ వహింప మైమఱచి గాఢోత్కంఠయై యున్న యీమె ముం దేమగునో తెలిసికొనజాలకున్నాను. ఇట్లెంతకాలము మమ్మీమె దుఃఖింపఁజేయునో, యీయనురాగము తుదకెట్లు పరిణమించునో, యీమె యవస్థ విని తల్లి యెంత తల్లడిల్లునో, తండ్రి యేమిచేయఁ దలంచునో యార్యురేమని యాలో చింతురో, పరిజను లేమి చెప్పుకొందురో, పురాతనకర్మఫలం బెట్లున్నదో నిశ్చయింపఁ జాల కున్నాను. కార్యగతులు కర్మాయత్తము లగుటచే నీ యపౌరుషవ్యాపారము నందు విధినిర్ణయ మెట్లుండునో తెలిసికొనుటకు వేచియుందునుగాక యని నిశ్చయించు కొని తత్కాలోచితముగా నామె కిట్లంటిని.

ప్రియసఖీ ! కౌభికమల కాస్తుఖాది లక్షణంబులు లేకుండుటచే నిందు లిఖింపఃబడిన పురుషుం డుపేంద్రుండు గాకుండుట నిక్కువము. మరియు మకరేక్షు చాపాది పరికరములు లేకుండుటచేతఁ జేతోభవుండును గానేరడు. భర్తృదారిక తలంచు చున్న ట్లింతడు వేఱొక్కడై యుండును. కావున వీరిరువురు నోడిపోతిరని చెప్పి యీ కిన్నరద్వందమును బంపివేయుము. నీవింతకుఁ బ్రత్యక్షముగను జిత్రపట మూలమునను వినికి వలనను దెలిసికొన్న యశేష సుర సిద్ధ విద్యాధరోరగ నరేంద్ర రూప స్వరూపములకన్న వీకితం డపురూప స్వరూపుండుగాఁ దోఁచెనేని యిచ్చట నుండి సత్వరమ లెమ్ము. సావకాశముగ నంతఃపురమును బ్రవేశింపుము. అందేకాంత ముగఁ గలతలేని చూపులచేతను, మనస్సు చేతను వీని నిరూపింతువుగాక. అంతవరకు నిజ మెరుంగుట దుర్లభము. ఇచ్చట కెవ్వఁడైన నేపని మీఁదనైన మనకు దెలియకుండ పృధుల పటభరాక్రమణమైన నళినదళశిఖర సుకుమారములగు నీరజాంగుళుల యందలి వణకును నిశ్చలముగఁ గూర్చున్నను శ్రమజలంబుతో నిండియున్న నీ శరీరాయాస మును దిలకించి యీ విధము గులవృద్ధుల కెరింగెంచిన నిన్ను కష్ట పెట్టి యుంటిమని వారు సఖులమగు మాపైఁ గుపితు లగుదురని నేను చెప్పఁగా నా మాటలధోరణి వలన నామె నిజమగు నవస్థను నేను దెలిసికొంటినని గ్రహించి సస్మితాపాంగతరళి తాక్షి విక్షేపమున నాకుఁ దనహృదయము నెరింగించుచు నాచేతికా చిత్రపట మందిచ్చి పరి జనుల విడచిపెట్టి యతిరయంబున నంతఃపురమున కరిగెను.

అందు గోమలమగు మరాళ తూలికాతల్పమునఁ గూర్చుండి నాచేతి యందున్న పటము గైకొని యత్యంతాదరమున నాకిట్లనియె. సఖీ ! తారావళీ ! ఇట్టి పురుషుని నీ వెచ్చటనైనఁ జూచియుంటివా ? ముల్లోకముల యందలి యువకుల రూప ములు చిత్రించునప్పు డెందైన నిట్టి యుత్కృష్ట రూపమును గాంచినట్లు జ్ఞాపక మున్నదా? వీని నెట్లెరుంగనగునో వచింపుము. త్రిభువనములలో వీని నెచ్చట‌ వెదుకఁ