పుట:కాశీమజిలీకథలు-12.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

201

యుదయసుందరి విస్మయమందుచు తారావళీ ! ఏదీ ! పట మిటు దెమ్ము. ఆతం డెవ్వడో నేను విమర్శించి చెప్పెదనని నా చేతిలో నున్న యాపటము లాగికొని పరి కింప దొడంగెను.

ఆ సుందరపురుషరూప సందర్శనము మాత్రముననే యామె హృదయమున ననంగశరపరంపరలు నిండిపోయెను. సర్వాంగములు గంపింప దొండంగెను. నెమ్మేన చెమటబిందువు లుత్పన్నమయ్యెను. ఆపాదమస్తకము రోమాంచమును విజృంభింప సాగెను. తోడనే హృదయమున బ్రవేశించు ననురాగమునకు దారి యొసంగుచున్నట్లు కంపించు వక్షోసిఖర‌మువలన దరళితములై హారయష్టులు బ్రక్కకు దిరిగెను.

అట్లు నిరాటంకముగ బ్రవేసించు ననురాగమును దిలకించి పరపురుష సామీప్యద్వేషిణియగు కులాంగన విధమున మనముననుండి లజ్జ తొలగిపోయెను. దొంగ యరగిన వెనుక వచ్చు రక్షక భటునివలె త్రపాశూన్య మగు హృదయమున నున్మాద మధిష్టించి యుండెను. ఉన్మాదపురుషపూత్కారపవనదండము విధమున మనమున రవుల్కొన్న మన్మధాగ్నిచే వేడినిట్టూర్పులు మాటిమాటికి వెడల దొడంగెను. మదన దావానలజ్వాలలచే సరళనిస్వాసారణ్యము మండిపోవుచుండ ముఖకమలపరిమళోపలో బాంధము లగు నశిబృందము లాలేడి బడి యాక్రందించుచుండెను. అంతఃకరణ మందిరము మదనాగ్నివలన మండుచుండుట యిందిందిరాక్రందన కోలాహలమున నెరింగి దహనభీతి నందున్న ధైర్యము పారిపోయెను. అసమరోమాంచసూచికాగ్రపు బోటుల కాకజాలనట్లు స్వేదవారి ప్లుతంబగు కపోలపత్రహంసమిధునము ధైర్యమేవలెనే జెదరిపోయెను.


గీ. సతత పురుషాపరాగ సద్ర్వతమునామె
    మనసు విడిచినయట్టులే మనసిజుండు
    హర్షమున లింగభేదంబు నరయకుండ
    నిశిత సాయకపంక్తుల నిగుడదొడగే.

గీ. అతిదరిద్రత నిష్టార్దమందుఁ గాంచు
    క్షుద్రతతివోలె లుబ్దమై సుదతిచూపు
    లామనోహరచిత్రరూపామృతంబు
    నానుచున్నను బరితృప్తి నందవయ్యె.

అప్పుడు నేనామెయవస్థం దిలకించి యిట్లని తలంచితిని. ఔరా! చిర కాలమునకు మకరధ్వజుండీ చిత్రస్వరూపము నాశ్రయించి నిజసుమసాయకనికరమున కీమె హృదయమును లక్ష్యముగా జేసికొన గల్గెను. ఈతడు. దివిజుడో, మనుజుడో,