పుట:కాశీమజిలీకథలు-12.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నభినవలతానిషేవణము నందును, కుసుమాపరయ వినోదమునందును, క్రీడాసరోవర ముల జలకేళి దేలుటయందును, నిరంతరము మనములకు వినోదము గలిగించుకొనుచు గాలము గడపుచుండెను.

ఇట్లుండ నొకనాటి ప్రాతఃకాలమున ఇను డరుదెంచినతోడనే మోమున వికాసము గనుపింప నధికానందమున గమలినీరమణులు ప్రబోధతరశితములగు నర విందపత్రేక్షణముల ననురాగముతో వాని వీక్షించుచుండ, మధుపానమత్తమధువ్రత వ్రాతము ఝంకారగీతముల బఠించుచుండ, వేలావసతరుశిఖరములందు నిద్రనుండి లేచి సముద్రసైకతోత్సంగములననుసరించి బారులుగట్టి విహంగ మకులములెగురుచుచుండ, నంతఃపురపరిజనము ప్రాతఃకృత్యముల యందప్రమత్తులై సంచరించుచుండ నాయుదయ సుందరి సుఖప్రబోధయై చక్కగా నలంకరించుకొని ప్రభాతక్రియల నిర్వర్తించి విలాస భవనమున సుఖాసనమున గూర్చొని బ్రసన్న ముఖియై యున్నసమయమున జెలిమి కత్తియలెల్ల నుల్లాసమున నామెం బరివేష్టించికొందరు రాత్రి యుద్యానదీర్ఘికా చక్ర వాకవియోగ‌ వేదనాక్రందనము దాము విన్న చందమున వినిపించుచుండ గొందరు కలిసియున్న లీలామృగ మిధునమువలె నల్లి బిల్లి గ నల్లుకొనియున్న లతం జూపుచుండ నత్యంత వినోదమున నున్న సమయమున మయూరకాఖ్య కిన్నర మిధువ మతిరమున నట కేతెంచి యేలాలతావల్కల నియమితంబైన చిత్రపట మొకదానిని యుదయ సుందరిమ్రోల బడవైచెను.

అక్షివిక్షేపమాత్రమున నామెయాశయ మెరింగి నేనద్దాని గ్రహించి యచ్ఛాదనమును దొలగించి చూడ నందొకసుందర పురుషుని ప్రతిరూపము జిత్రింప బడియుండెను. ఆ యద్భుతస్వరూప సందర్శనమున విస్మితురాలనై యౌరా ! మయూరకా ! ఇందు లిఖింపబడిన సుందరపురుషుం డెవ్వడో చెప్పుమని బ్రశ్నింప వా డిట్లనియె. నేడు వేకువను సముద్రాంతర్ద్వీపమందలి పర్వతమందు విహరింపబోయి మేము తిరిగివచ్చుచుండ నొక చోట విచిత్రతరులతాప్రశోభితమగు సుందరజలాంతర స్థలమున బడియున్న యీ పటము మాకు గోచరమయ్యెను. అందున్న సుందరాకార మును నే నతికౌతుకమున వీక్షించి శంఖాకితకరుం డగుటచే నీతండు నిక్కముగ బురుషోత్తము డగునని నా ప్రియురాలు మయూరికతో బల్కితిని.

శంఖ రేఖాదులవలన మురారియని మీరు తలంచుచుంటిరి గాని ! యిట్టి సుందరాకారమున నెసంగు నితండు మన్మధుండని నాభార్య వచించినది. ఆ విధమున మాకు వాదోపవాదములు జరిగినవి. ఎవరి వాదము వారు సమర్థించుకొననెంచి చివురకు మే మిరువురము బందెములు వైచుకొని మీవలన నిశ్చయ మెరుంగుట కద్దాని నిందు దెచ్చితిమి కావున నీరూప మెవ్వరిదో మీరు నిర్ణయింపవలెనని బలికెను. అప్పుడా