పుట:కాశీమజిలీకథలు-12.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

జమును నోటి కందీయ వాడది గబళించి లలత్పిశితవల్లూరమని జప్పరించుచుండ నా బాధ కోర్వలేక కోరలు గనుపించునట్లు నోరు దెరచుకొని మోము బైకెత్తి వికటముగా పూత్కార మొనరించుచు రోదనము జేయుచున్న యీ ప్రేతజాయందిలకింపుము. ఒకచో బిచాచ యువకులు ప్రజ్నలితచితోదరమునుండి కించిదాపుష్టకుణపమును గొని వచ్చి హర్షమున గహకహారావం బొనరించుచున్నారు. మరొకచోట ప్రేతసంఘాతములు, వేరొకచోట వేతాళబృందములు, ఇంకొకచోట భూతకదంబములు, ఇట్లు సర్వత్ర భీభత్సదర్శితంబైన యీశ్మశానమున నిలిచియండుట సకలసౌభాగ్యసమేతుండవై ధరణీ రాజ్యలక్ష్మీధురంధరుండవగు నీకు మంగళప్రదము గాదనివచించు నా తపస్విని పలుకు లాదరించి యా రాజేంద్రుడిట్లని తలచెను.

ఈమె వచించినదెల్ల నిక్కము. ఇచ్చట సర్వత్ర భరింపరాని దుర్వాసన ప్రబలియున్నది. చితాధూమం బెల్లెడల వ్యాపించియున్నది. భూతప్రేతపిశాచముల కాటపట్టగు నీస్మశానమును సత్వరమె విడిచి పెట్టుట యుచితమగును. ఈమెను బ్రశాంతమ తపోధనాశ్రమమున సగౌరవముగ దోడ్కొనిపోయి యందు స్వస్థతం బొందిన పిదప నీమె యెవ్వరో యెచ్చటనుండి వచ్చినదో లంకాపురంబున కెందుల కేగినదో యింత లేబ్రాయమున దాపసి యేమిటి కయ్యెనో మొదలగు వృత్తాంతమెల్ల దెలిసికొనెదంగాక యని నిశ్చయించి యా రాజపుంగవుడు శ్మశానమున కధిష్టాత్రియైన భీషణయను దుర్గాదేవి సమీపమున కేగి ఫాలాక్రమిళిత కరసంపుకూంజలుండై ప్రణ మిల్లుచు నిట్లని సన్నుతించెను.


శ్లో. విద్యుత్పుంజోగ్రనేత్రం పృధుచపల లలజ్జింహ ముద్వర్తగల్లం
    సృక్కాంతోదగ్రదంష్ట్రాప్రకటమసరళసూలపింగోర్ధ్వకేశం
    వక్త్రం కల్పాంతకాల ప్రబలఘనఘటా ఘోష ఘోకాట్టహాసం
    చండ్యాఃస్వర్గారివర్గగ్రసనరకషద్దంత దండంనమామి.

ఇట్లద్దేవిం బ్రస్తుతించి యాతపస్వినిని వెంట దోడ్కొని శ్మశానవాటికనతి శీఘ్రముననిష్క్రమించి నగరమధ్యమున కేగియందు విశ్వభూతియను వృద్ధతపస్విని మఠమున బ్రవేశించెను. అనుచరవిరహితుండై యారాజేంద్రు డర్ధరాత్రమున నొక కన్యాతపస్వినిని వెంటబెట్టుకుని వచ్చుట కా విశ్వభూతి యక్కజంపడుచు నా భూజా నిని యధార్హరీతిని గౌరవించెను. పుండరీకుండా వృద్ధతపస్వినికి నాటిఱేయి జరిగిన వృత్తాంతమెల్ల జెప్పి యామె కానందమును కల్గించెను.