పుట:కాశీమజిలీకథలు-12.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలయోగిని కథ

193

యీమె నూరడింపగలను ? అని యా రాజేంద్రుండు విదర్కించుకొనుచుండ నా తప స్వినీ కన్యక కలంక ముడిగి నిజకల్కలోత్తరీయమున వక్త్రాంబుజమును దుడుచుకొని కువలయదళ కోమలములగు జూపుల నతనిపై బరపుచు మృధుమధుర వాక్కుల నా నరేంద్రున కిట్లనియె.


శా. ప్రేతస్త్రీగధితాస్రతోయయుతమై, వేతాళికాలూనమాం
    స్వాతిప్రోజ్వలమై, విశుష్కకీకస నికాయాకార వి
    జ్ఞాతంబై విలసచ్చితానలగ తాళ్మంతరంబై కసన్‌
    బ్రేతారణ్యము రక్తభోజనుల కర్ధి వ్‌ వంటయిల్లయ్యెడిన్‌.

మరియు నియ్యది పిశాచలోకనగరములో మహాసంఘసంభృతంబగు నడివీధి వలెనున్నది కదా ?


చ. శిరమున నాంత్రరజ్జువులఁ జేర్చి, మహాజగరోగ్రచర్మమం
    బరముగఁ దాల్చి మూఁపునను బ్రాంశుతరావిరశాస్థిదండమున్‌
    గరమువహించి ప్రేతతతి కంపమునొందఁగ ఫేత్కృతి ధ్వనుల్‌
    బరవుచు నీపరేతపురి భైరవుఁ డుండెను దండపాణియై.

ఇంద్రుగ్రీడాసంక్రాంతకౌణపవిముక్త ఫేత్కారముఖరములగునర కరంక ములయందు గూడ రాక్షసత్వము గనంబడుచున్నది. జంఝామారుతమువలనపైకి రేగు చితాభూతమునకు గూడఖేచరత్వము గలుగుచున్నది. కరాళకోటరకుటీరముల నాశ్ర యించియున్న మర్కటముల కిలకిలారావరౌద్రస్వనంబువలన నీ యశ్వత్ధభూరుహము గూడ భూతభావమును బొందియున్నది. మరియును -


చ. కరములఁ జిమ్మువేగమునఁ గల్గెడుగాలిని శ్రోత్రనాసికాళ
    తరములు మ్రోతబెట్ట, గణనం బొనరింపఁగ‌ నస్థియంత్రము‌ల్
    సరభసవృత్తి నాట్య మొనరించు బిశాచము లిందు గీతవా
    ద్యరతి లయానుగుణ్యముగ నస్రసురాపరితృప్తి నీచమై.

చ. ఫలలముగొంతఁ గక్షములఁ బాణుల గొంతయు శేష్యమాస్యమం
    దలవడఁ గొన్న లుబ్దకుణపాధము గాంచి హఠంబుజేసి యి
    మ్ముల హరియింప వేగ మొక భూతవుడింభకుఁ డడ్డు వచ్చి దో
    ర్బలమున హుంకరించి ప్రహరంబుల నొంచి యలంచు నల్లదే.

నిరంతరమును నరమాంసపుముద్దలం దినుచున్నను దృప్తిజెందని డింభ కుని దన యుత్సంగమున నిడుకొని యుపలాలించుచు నతి నచ్బటైకమగు నిజవక్షో