పుట:కాశీమజిలీకథలు-12.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నన్నువంచించి పోవుచున్నదను కోపమున నిజస్వరూపమును దాల్చి హతాశుండనై యతిజవమున నామెవెంట బడతిని. రావణుఁడు సీతను బలాత్కారముగా నపహరించినట్లామెను గైకొనఁదలంచితిని. అట్లు పారిపోవుచు నామె యిచ్చటఁ బడినది. పుణ్యవశమున జగదేకరక్షకుండవగు నీశరణ్యమామెకు లభించినది పిదప దేవరతో నాకు సంగరము గలిగినది శవపిశిపేశితోత్కర్తన కర్మైకశక్తిగల యాకత్తి నీవు ధరింప దగినదికాదు. నేనొసంగిన కృపాణమో తలంచినంతనే సన్నిహితమగుచుండు దివ్య ప్రభావము గలది. వెనుక నొకప్పు డీ ఖడ్గరాజము స్వప్నమున నాకుఁ గనంబడి దేవాంశసంభూతుఁడగు పురుషునిమీఁద నన్నుఁ బ్రయోగించిన నుపయోగముండనేరదని బలికెను. అజ్ఞానుండనై దీనిని నీమీదఁ బ్రయోగించితిని.

దేవాంశసంభూతుండ వగుటచే నియ్యది నిన్నేమియుం జేయఁజాలక నమస్కరించునదివోలె పాదమూలమునం బడినది‌. కావున నే దీనిని నీ కొసంగితిని. ఈ తపస్విని యందుగల నా మోహమెల్ల ననౌచిత్యవిషయ మగుటవలన, దండధరుని భయమువలన, వివేకప్రబోధము వలన మనంబున నుదారాశయము గలుగుట వలన, బూర్తిగా నశించెను. ఇదియే నా వృత్తాంతము. ఇఁక నాకు సెల వొసంగుము. సత్వ రము పోవలయునని రాజేంద్రు ననుమతము బడసి యా నిశాచరపుంగవుండు సూర్యో దయమైనతోడనే పోవు చీఁకటివలెనే తిరోభూతుఁ డయ్యెను.

ఆ బాల తపస్విని రాక్షస భయిమునఁ గలిగిన వణకుచే నెమ్మేనఁ బొడ మిన చెమ్మటయెల్ల నడంగ స్వస్థచిత్తయె యా మేదినీకాంతుని రూపమును సచ్చ దృష్టులం దిలకించి యెద్దియో స్మృతినభినయించుచు మోమువంచి మృత్యుముఖమున నుండి బైటఁబడిన హృదయమును క్షాళన మొనరించురీతి నవిరళాశ్రుధారలు నయ నంబుననుండి గార వెక్కి వెక్కి యేడువఁదొడంగెను.

పుండరీకుం డామెంగాంచి జాలిఁగొని అన్నా ! రక్క.సుండను క్రూర గ్రహము వలన విడువంబడి వర్షానక్షత్రప్రవృత్తివలె ననివారితముగ నయనఘనజలా సారమును గురియుచున్నదా యేమి ? సహజోష్ణంబులగు నశ్రుధార లీమె హృదయం బునబడ నా యెదను దహింప జేయుచున్నవి గదా ? నేను సంగరమున బడిన కష్ట మును జూచి యామెడెంద మార్ధ్రతంబూని యిట్లు ద్రవించుచుండవచ్చును లేక తన్నట్లు చిక్కులం బెట్టినరక్కసుం డక్షతుండై పోవుటకు విచారించుచుండెనా ? వ్రతనియమము చెడెనని విలపించుచుండెనా ? లేక యితర దుస్సహఃఖానుస్మరణమున నిట్లాపన్నురాలగు చుండెనా ? అదేమై యుండును ? ఏమని నేను నిర్ణయింపగలను విచారకారణం బెరుంగక నేనేమని యంత్రపుం బొమ్మవలె గన్నీరు విడుచుచున్న