పుట:కాశీమజిలీకథలు-12.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వచ్చుటకు నిజసదనమున కరిగియుండెనా ? మాయచే నన్ను వంచించుటకు నభముల కేగెనేమో ! నాయాశయ మెరుంగుట కిట్లుంవచ్చును. రాక్షసుల యుద్ధక్రమం బీక్రియనే జరుగుచుండునేమోగదా ! వాడు బలాయుతుండగుటవలన నింతటితొ సమరోపసంహార మైనదనుకొనవచ్చును. నేనింక నీతపస్వినిని వెంటగొనిపోదునా ? లేక యింకొకక్షణము నిరీక్షించి యుందునా ? రాక్షసులు క్షుద్రప్రవర్తనలు కావున నా పాపాత్ముని జాడ నింకొకముహూర్త మరసెదంగాక యని తలంచుచుండ నకస్మాత్తుగ నందున్న మహాంధకూపమునుండి భయంకరహుంకారరవం బుప్పతిల్లెను. తోడనే యందుండి పొగ లేచినది, తదనంతర మతిభీకరంబగు నగ్నిజ్వాలలు వెల్వడినవి ఆ మంటలతో దుర్నిరీక్ష్యతేజుం డగు రాక్షసుం డేతెంచి రాజుముందర నిలచెను.

ఆ యగ్నిజ్వాలలు జాలదూరము వ్యాపింప బుడమి మండుచుండెను. దిక్కులు మండుచుండెను. ఆకాశము మండుచుండెను. ప్రళయకాలానలమున బడి పోయినట్లు విశ్వమంతయు నాకులత్వ మందెను. అట్టి సమయమున వా దగ్నిమయా కృతియై, యగ్నిమయాలోకపద్దతియై, యగ్నిమయాలాపవృత్తియై, యగ్నిమయాస్త్ర సంభృతియై, యగ్నిమయాశేక్షవ్యావృత్తియై తీక్ష్ణవచనముల నాక్షితిసాల పుంగవున కిట్లనియె.


శా. నీబాహుబలకౌసలం బడరి హానిం జెందగా ఱాయిగా
    దాబోఅందిన తాళవృక్షమునుగా దస్త్రంబునం దస్త్రమున్‌
    గాఁబో దిద్ది దవానలంబు నిఁను దీక్ష్ణజ్వాలలన్‌ మ్రింగెడిన్‌
    నీ బాధన్‌ దొలఁగింప నాకరుణగానీ‌ లేదు దిక్కన్యమై.

ఓరీ ! నరాధమా ! ఈదారుణాగ్నిజ్వాల లావరించినప్పుడైన రక్షింపుము రక్షింపు మని నన్ను శరణు వెడుకుండజాల వని పలుకు నారక్కసిమొక్క లీనితో బుండరీశుండు మందహాసభాసుర వదనపుండరీకుడై యిట్లనియె. ఒరోరీ క్రవ్యాదకీట కాధమా ! రమ్ము నీబిరం బడంప నేను సంసిద్దుడనై యుంటిని. నీవలెమాయా ప్రయోగ ప్రకారమునంగాక వీరపురుషోచితం బగు సంగ్రామమున నీమదము సదమద మొనరింతును. నాచేత నిర్జింపబడి యిప్పుడే గదా పారిపోతివి. చల్లటినీటిచే నార్పదగిన యగ్నిజ్వాలలతో నిప్పుడు సిగ్గులేక వచ్చి రణప్రగల్భము లాడుచుంటివా? ఓరి పెశాచ పశువా! ఈసమరాధ్వరమున బశువువలె నిన్ను విశసనం బొనరింతును. నిన్నేమి చేసెదనో వినుము.


శా. నీసర్వాంగములన్‌ దవానలశిభానీతప్రచండాగ్ని కి
    లాసందోహమునందుఁ బక్వమగు లీలన్‌ జేసి మాంసంబు దీ
    వ్రాసిన్‌ గోసి తదీయఖండములు గాలాస్వస్ఫురద్గహ్వర
    వ్యాసంగంబున నేను బెట్టెదను మాద్య చ్ఛీతలగ్రాసమున్‌.