పుట:కాశీమజిలీకథలు-12.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాక్షసుని గర్వభంగము

183

డును బోరియుండవు. నీ బీరం బెంతటిదో జూచెదంగాక. ఇదిగో మద్భుజపరిఘ ప్రహారముల గాచికొమ్మని చేరువనున్న తాళద్రుమము బెరికి పై కెత్తి బిరబిర ద్రిప్పుచు రాజుపై విసిరెను. తోడనే యతండు దానిని నిజకృపాణ ధారాభిఘాతమున దుత్తు నియలుగ నొనరించెను. రక్కసుం డుక్కుమిగిలి యింకొక్కదానిం బెరికికొనివచ్చి వాతం గొట్టెను దానినిగూడ పుండరీకుం డశ్రమమున ముక్కలుజేసెను. రక్కసుం డిట్లెన్ని వృక్షముల బెకలించి మీద వైచుచున్నను వానినెల్ల ఖండఖండములుగ నా రాజోత్తము డొనరించుచుండెను.

ఇట్టి యుద్ధమున నా ప్రాంతభూరుహములెల్ల శూన్యమైనవి. పిదప నా నక్తంచరుండు శిలాసమర మొనరింప బూనెను. రాజేంద్రుం డప్రమత్తుండై నిజకుఠార ధారల వాని నెల్ల నుగ్గుసేయ దొడంగెను. పిదప గొంతసేపు వారిరువురకును నస్త్ర యుద్ధము జరిగెను. అందుగూడ బుండరీకుడే మేలు చేయియయ్యెను. పిదప నారక్క సుండుక్కివమున నెక్కడనుండియో యొక విశాలదారుణ పాషాణమును శిరమునఁ బెట్టుకొనివచ్చి దర్పోద్రేకమున నిట్లనియె.


చ. అమరఁ గృతాంతుపీఠమున కత్యధికంబయి, మారియింటికు
    డ్యమునయి, మృత్యుదేవికి శుభాస్పదమౌ యభిషేకవేదికై
    పరగెడి యశ్మఖండ వ్రక్కలుసేయు భవచ్చరంబు, యె
    వ్వరు నింక దీని నడ్డఁగలవారలు లేరు సురాదు లందునన్‌.

ఇట్లనుచు రాజేంద్రుని బ్రహరింపనున్న యారక్కసుని ప్రవత్తిం గని యా తపస్వని హహాకార మొనర్చుచు నారాజున కేమి ముప్పు వాటిల్లునో యని నెమ్మనమున భయమందుచుండెను. ఈ యేటు దప్పించుకొనుట మానవేంద్రున కతిదుష్కరమని యంబరచరులు వగచుచుండిరి. ఈ పాటుతో ధాత్రి యనాధయగునని దిక్పాలకులు గుందుచుండిరి. ఇంతలో యుద్దవిశారదుండగు మేదినీకాంతండు ఖడ్గమును విడిచి యతి రయమున వేఱొకగండశిలంగైకొని యా రక్కసుని మణిబంధమును విరుగగొట్టెను. మణిబంధము విరిగినతోడనే చేతనున్న యదారుణశిలా శకలము నేలబడి పతనవేగమున భూమియందు లోతుగా గ్రుంగిపోయెను. అంత పోరు దిలకించుచున్న నభశ్చరుల సాధువాదములు దిక్కుం బిక్కటిల్లెను. పిమ్మట దనప్రయత్న మెల్లనట్లు విఫల మగుట కారాక్షసప్రవరుండు విభ్రాంతుడై యదృశ్యు డయ్యెను. అందుల కా రాజు విస్మయమున నిట్లనుకొనెను.

ఏమిది ! అసమానపౌరుషముగల నీపిశితాశనప్రవరుం డిట్లు సమరసమా ష్టము గాకుండగనే మాయ మయ్యెనేమి ? సంగరరంగమున నరునిచే నిర్జింపఁబడుటకు లజ్జపడి యిట్లు తిరోభూతుం డయ్యెగావలయు. మరియొకయుపాయ మెద్దియైన గ్రహించి