పుట:కాశీమజిలీకథలు-12.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాక్షసుని గర్వభంగము

181

తోడనే యతం డోహో ! భయపడకుము. భయపడకు మని యాసన్న మరణ భయాకులిత యగు నా తపస్విని నాశ్వాసించి యానిశాచరునిచే నామె హానిం బొందకమున్నె తా నచటకు జేరుకొనుటకు మనమున సంతసించుచు నా రాక్షసాధము నుపలక్షించి హుంకార పురస్సరంబుగ నోరీ ! దురాత్మా ! విడువుము తొలగిపొమ్ము. ఈమె నీకు జాలిన యాహారము గానేరదు. ఈ పితృవనమున గాలాపహృత జీవితము లగు జంతుకోటుల సర్వత్ర గ్రహించి తత్చిశిత పిండములచే దుష్పూరంబగు నీజఠ రగర్తంబును నిండించుకొనుమని పలికెను.

ఆ రక్కసుం డక్కజంబుల నక్కుంతల భూపరీవృఢుంచు దిలకించుచు నౌరా ! సురసిద్ధవిద్యాధరోరగ మనుజగుహ్యకులలో నీ యువకుడెవ్వడై యుండును? నేనింతకు ద్రిభువనముల సంచరించుచు బురుషుల నెందరినేని జూచి యుంటిని గాని యిట్టివాని నెందును గని విని యెరుంగను. ఆహా! ఏమి యీ పురుషపుంగవుని శరీరీలావ ణ్యము ! ఏమి వీని సౌందర్యము ? ఏమి వీని దైర్యము ! వెరపు బుట్టించు రక్కసు లకు గూడ భయంకరుండనైన నా యెదుట నితడు శంకలేక కత్తిదూసి నిలువబడుట విచిత్రము గదా! వీడెవ్వడో యొక నసామాన్య వీరునివలె గన్పట్టుచున్నా డు. సమరము నకై యేతెంచి భుజాస్ఫాలనం బొనరించు బ్రతి వీరు నిట్లు మెచ్చుకొను చుండుట వీర పురుష లక్షణముగాదు. వీని సామర్ద్యం బెరింగెదంగాక యని యా భూమీశు నీక్షించి యట్టహాసంబొనరించుచు వాని కిట్లనియె.

ఓరీ ! నీ వెవడవురా ! త్రిదశులకైన నజేయవిక్ర‌ మక్రముండనగు నాతో నీమె కొరకేమిటి కిట్లు గలహింప నెంచెదవు? కల్పాంత విస్తృతాంభోధి జల మహా ప్లవంబునబడు వసుంధర నెవడైన మునుగకుండ దప్పింపగలడా ? నా చేజిక్కిన ఈ యీశ్వర తపస్వినిని విడిపింప ‌సమర్థు డెవ్వడుగలడు ? రెండు చేతులు మాత్రమేగల జంతువవు నీవేమి చేయగలవురా ? చతుర్భుజుండగు నారాయణునకు దశభుజుండగు హరునకు, ద్వాదశభుజుఁడగు కుమారునకుగూడ నే నజేయుండ నని యెరుంగుము. ఇక దక్కినవారి లెక్క యేమి? కావున నేను నీకు హితోపదేశం బొనరించుచుంటిని. బుద్ధి గలవాడనై నీవీ యశక్యమగు కార్యమునకు బూనుకొనకుము.

యౌవన ప్రాదుర్భావ గర్వమున నభంబున కెగురజూచెద వేమిటికి ? దర్పాంధుడవై కృతాంతముఖ కూపంబున నెందులకు బడఁ దలంచెదవు? వీర వ్రతము పేరున మృత్యువు నేమిటి కారాధించెదవు  ? శౌర్యగ్రహావిష్ట హృదయుండవై ప్రజ్వ లించుచున్న యగ్నికుండమున దుముక నేలసాహసించెదవు ? రణరనాస్వాద ప్రవృ త్తిచే విషతరుఫలముల భుజింప నేమిటికి గమకించెదవు ? సుభటచర్యా కుతూహలైక దుర్ల లితుండవై దారుణ పన్నగములో నేల గ్రీడింపదలంచెదవు ? భజబలావష్టం