పుట:కాశీమజిలీకథలు-12.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

175

కించుచున్న సమయమున భస్మోద్దూళిత సర్వాంగియు తపిలజటాకలాపయు, వల్కల పటావృతయు, దురవలోక ప్రకృతియు నగు నొక వృద్దతపస్విని యెక్కడనుండియో మహాకోపమున నాగర్భగృహోపకోణము ననుసరించి బిరబిర నరుదెంచి చూపుల నిప్పులు రాల్చుచు వెరపుగొలుపు తీక్ష్ణవచనముల నన్నుద్దేశించి యిట్లనియె.

ఓరీ! పాపాత్మా! పురుష పశువా! వివేకశూన్యా! మనుష్యాధమా! నీ వేలరా వచ్చి యీ ప్రదేశమెల్ల నపవిత్రముగ నొనరించితివి ? అపవర్గ విషయవేదులై మహాత్ము లధిష్టింపదగిన యీ వేదికపై నేమిటి కడుగిడితివిరా ? మూఢుడా ? దేవతార్చనోపకర ణంబగు నీవస్తువు నిట్లేల భగ్నమొనరించితి ? నీదుర్వినయమున కిప్పుడే తగినఫల మనుభవింతువుకాక. మొదట నేనన్నట్లు నీకు పశుభావమబ్బగలదు. ఒకచోటనుండి యిట కెగిరిపడితివి కావున పతంగ జాతియందుబుట్టుము. మాణిక్యశుక్తి కా భంగం బొనరించిన కారణమున దదాకారముగల చంచువుం బూను చిలుక వయ్యెదవుగాక. మరియు నీపటము శుకజాతి విలక్షణముగ నీ తలపై బింఛము రీతి నుండగలదని నన్ను దీవ్రముగా శపించెను.

అట్లు శవ్తుడనై నేనేమి యపచార మొనరించితినో యెరుంగక క్రిందు జాడ నందు బరువబడిన కృష్ణాజినమును దానిపైన నాకాలుదగిలి ద్రద్దలైన మాణిక్యశుక్తి యును గనుపించినవి. వానిం దిలకించి మిగులననుతాపము నందుచు నయ్యో! చిక్ర పటవిలోకనావ్యగ్రహృదయుండనై యీ కృష్ణాజినమును ద్రొక్కుటయు దానిమీద నున్న శుక్తి కాలికిదగిలి భగ్నమగుటయుగూడ‌ నించుకయును దెలిసికొనజాలనైతిని గధా? నేనొనర్చిన దుష్కర్మము వలననే నాకిట్టి పరిణామము గలిగెను. కానిమ్ము. విధి దేనిని సమకూర్చునో దాని ఫలంబనుభవించెదంగాక.


గీ. గాత్రములు గాంస్యపాత్రలు గర్మగతిని
    ఛిద్రతనుగాంచు నయ్యవిచిత్రముగను
    కాంస్య కారకువైఖరిఁ గడక నెపుడు
    నరయ పరివర్తనమొనర్చు నావిధాత.

కావున నాకీ శాపసంతాపము దప్పించుకొనరానిదగుటవలన నందులకు విచారింపబనిలేదు. కాని యారమణీమణి వృత్తాంతము దెలిసికొనజాలమికి మిగుల వగచుచున్నాను. ఆమె యెవతె? ఎవని తనూజాత? ఏకులమందు జన్మించినది? నివాస స్థలమెయ్యది? ఇచటికేమిటి కేతెంచినది? నామధేయమేది ? ముజ్జగములయందును సాటి లేని రూపముగల యీ యువతీమణి యపహసితానంగ రూపుండగు పురుషపుంగవుని హృదయమునందువలెనే యీపటమం దిట్లేలదాల్చి యున్నది. అని యిట్లు నాలో నేనే ప్రశ్నించుకొనుచున్న సమయమున శాపకలకము విని పుష్పాచయము మాని పూదోట