పుట:కాశీమజిలీకథలు-12.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

171

పింపబడు నంధుని విధమున నే దిక్కునకు బోవుచుంటినో, దేని నతిక్రమించితినో, ముం దెచ్చటి కేగుచుంటినో, యందలి భూము లెట్టివో, గిరసరత్కాంతారపరిగతం బగు నమ్మార్గం బెట్టిదో, యందలి జనపదము లెట్టి ప్రచారము గలవియో యించుక యును దెలిసికొనజాలకుంటిని. కాని మాటిమాటికి జల్లని పిల్లవాయువులు నమ్మేన సోకుచుండ నా విమానయానమున గమలసుఖమును మాత్ర మనుభవించుచుంటిని.

రాజేంద్రా ! ఏమి చెప్పుదును ! అట్లు పోవుచుండగా నొక్కచో నావిమా నము దివ్య ప్రభావమెల్ల భగ్న మైనట్లు, సంచారయంత్రము చెడిపోయినట్లు ముందేగ సమర్థత లేనట్లు, యెవనిచేతనో నిరోధింపబడినట్లు కదలకుండ నాగిపోయినది. అందు లకు నే నతి విస్మయా హృదయుడనై నే యడ్డంకియు లేని యానభోమార్గమున నతి జవమున నేగుచున్న విమాన మెందులకు నిలిచిపోయినదో నే నెంత యాలోచించినను నిజస్థితి నించుకయును దెలిసికొని జాలనైతిని. దాని యడుగు భాగమున నమరింప బడియన్న విమలమణిదళమునుండి గనుపించు దురంత విస్తారమగు పయోరాశి మాత్రము గోచరమయ్యెను. దానిం గాంచి నే నక్కజంపడుచు నింత నీరున్న ప్రదేశ మెద్ది ? ఇదే దేనియొక మహాహ్రదమా ? లేక మింటి కెగయ తరంగములతొ నొప్పు సరోవరమా ? కాకున్న లంకాపురమును జుట్టుకొనియున్న దక్షిణాంబోనిధియై యుండునా ? అని యిట్లతి డోలాయమాన మానసుడనై వితర్కించుచుండ దోడనే కింకిణీనినాదమున గలకల ముదయింప నా విమానము గంపింప దొడంగెను. ఆ కద లికకు నేనందు గూర్చుండజాలక యత్యంతభయమున దానినుండి నూఁతఁ జేసికొన బోవుచుండగా నాతో నవ్విమాన మాయంభోధి మధ్యంబున బడిపోయెను.

ఆ యగాధ జలగర్భమున మునిగిన తోడనే నాకు చైతన్యము తప్పినది. తిరుగ నాకెట్లు తెలివివచ్చినదో నే నెరుంగను. అప్పుడు నాకు విమానముగాని సాగ రముగాని గనుపింపలేదు. కాని విమలవిద్రుమ శిలా నిర్మాణమగు నొక ప్రాకారమణి మయ ద్వారము నా యెదుట గనుపించెను. దానిం దిలకించి విస్మయమందుచు నేనిట్లు దలంచితిని.

ఔరా ! నన్నిందు జేర్చిన యా విమానయానమేది? నేను మునిగిన యా సముద్ర మేమైనది? నే నందు మునుగలేదా ? పారావాల నిమగ్నములైన నా యంగ ముల నట్టి చిహ్నము లేమియును గనంబడవేమి ? నేను మఱొకడను గానుగదా ? బహుతరంగతాడిత సర్వాంగుడ నగు నాకిట్టి విధమున గనుపించుచున్నదేమో ! ఇయ్యది సముద్రగర్భమం దెద్దియో గొప్ప యింద్రజాలముగా దోచుచున్నది. తిమి తిమింగిలాది జలజంతువుల గర్భమం దెచ్చటనైన నే నప్పు డుండలేదుగదా ? వెనుక యోజనశక్తి కా గ్రామమున బిప్పలకునియింట గలలో గాంచిన స్త్రీ సింహశిక్షాకైత