పుట:కాశీమజిలీకథలు-12.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఔరా ! ఇదేమి చిత్రము ! ఇంతలో వీరంద ఱేమైరి ! అయ్యో! నాయం దత్యంతవాత్సల్యమున నమ్మహానుభావుండొసంగిన దివ్య కృపాణమును నిముసములో బోగొట్టుకొంటిని ! దానిసహాయమున నే నెన్నియో యద్భుతకార్యముల సేయనెంచితిని. అన్నియును వ్యర్థములైనవి. నాదుర్వ్యుసనలోపత్వమే నన్నింతకు దెచ్చెను. బుద్ధి వచ్చి నది ఆ కత్తి యున్నవానిని దేవదానవులుగూడ జయింప జాలదని యమ్మహాత్ముండు మొదటనే చేప్పియుండెను. కావుననే దానిని నా సన్నిధినుండి యపహరించుటకు వీరె వ్వరో యిట్టి పన్నుగడ వేసియుందురు. వీరి మాయల నే గ్రహింపజాలక చేతి కబ్చిన లిబ్బిని చేతులారా జారవిడిచితిని. పోనిమ్ము నే నప్పుడు పూర్వము వలెనే యుంటిని. ఆ కాపాలికుండు నాకాఖడ్గము నొనంగలేదని యనుకొనెదంగాక ! అట్లనుకొననేల ? దానికి మారుగ నాకీ విమానము లభింపలేదా ? ఇది కీడులో మేలు. దీనికంతరిక్షగమన మున్నదిగదా? నేనిం దధిష్టించి లంకా పట్టణమునకు దృటిలో బోవచ్చును. నా పయన మునకు బరమేశ్వరుండు దీని నాధారముగ నొసంగె గావలయును. నా పూన్కె నెర వేర్చుకొనుట కా ఖడ్గ ప్రవరముగూడ నున్న నెంత బాగుండును ? నా భుజబల పరాక్ర మములకు దోడుగ నీవిమానముతో నాఖడ్గముగూడ నున్న ముల్లోకముల జయించి యపర దివస్పతినై చెలంగకుందునా ? కలిగిన దానితో సంతృప్తి నందుట ధీర లక్షణమందురు. ఆ కృపాణము లేకున్నను మద్భుజబలము మాత్రముననే లోకమంతయును సాధింప గలను. భుజబల సంపన్నునకు సాధింపరాని దెద్దికలదు ? ఈ విమానమెక్కి నే నిప్పు డేల లంకకు బోవరాదు ? దివ్యశక్తిగల విమానయానము దన్నధిష్టించి యున్నవాని యిచ్చ వచ్చినచోటికి బోవునని చెప్పుదురుగదా ! కావున దీని నధిష్టించి నే నిప్పుడే లంకాపురమునకు బయన మగుట యుక్తమని నిశ్చయించి యాక్షేత్రపాలునకు దుర్గా మహాదేవికిని భక్తి ప్రణామము లాచరించి యతి సాహసమున నవ్విమాన మధిష్టించి లంకాపురమున కేగవలెనని తలంచుకొంటిని.

మహారాజపుంగవా ! వినుము. నే నవ్విమాన మెక్కిన తోడనే యది యతి జవమున బైకిలేచి హరగళగరళమలీ మసంబగు నంతరిక్ష శిఖరమున కేగి యందుండి ముందున కరుగ దొడంగినది. అట్లతి వేగమున బోవుచుండ దాని స్వచ్చపతాక కాంతి కలాపము గాలిచే గొనిరాబడిన గగనగంగాడిండీరపటలమువలె విలసిల్లెను. తిమిరము నడంప గొనిపోబడు ప్రదీపతంత్రమువలె నవ్విమానమున సమర్చబడిన యనంత రత్నద్యుతులు జెలగెను. తదీయ కింకిణీరణత్కార నిస్వనము వేగమున సమీర వీరు జయించి యొనరించు విజయ కోలాహలము గతినతిశయించెను మరియు నయ్యది నతి వేగమున గదలు పతాకముల పటపటాత్కారముతో గనకదండముల నభస్తలమును విచారించుచు, జలధరముల నతిక్రమించుచు, తారలక గదలించుచు, నతిజవమున నట్ల రుగుచుండ నప్పటి చీకటి యడంగి వెలుగు వచ్చియుండెను. అందు నే నన్యునిచే నడ