పుట:కాశీమజిలీకథలు-12.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారకేసరి కథ

167

పాయమున నెచ్చోటనుండి యీ రాత్రి గడపగలను. ఏ చెట్టుతొర్రలో విశ్రమించి యుందును ? ఏ కొండ గుహలలో దలదాచుకొందును ? ఏ నికుంజపుంజంబున నడగి యుందును ? ఇంతకన్న నివసింప ననువగుతావు ముందెద్దియైన దొరకునేమోయని విత్కరించుచు నంధకారబంధురమ్మగు నమ్మహారణ్యమున నతిభయమున బరిభ్రమించు చుంటిని.

ఇంతలో దూరమున నాకటికిచీకటిలో మురారి వక్షస్థలకౌస్తుభమువలె బ్రకాశించుచు దీపభ్రాంతిగొల్పు నెలుగొకటి ముందు గనుపించెను. దానింజూచి సంశ యాకులిత చేతస్కుడనై ఔరా ! ఆ వెలు గేమైయుండును ? ఏదైన దీపకాంతియా ? లేక రవులుచున్న దావాగ్నిశిఖయా ? కాకున్న నేదైన దివ్యౌషధీవిశేషమా ? ఏదైన నగుగాక. దీని ననుసరించిపోయి నిజమెరింగెదనని నిశ్చయించుకొని యావైపు బోవ ముందు నాకొక జీర్ణదేవతాయతనము గోచరమయ్యెను. దానిముం దొక మండపము గలదు. అప్పుడు నే నతిహర్షంబున దానిని సమీపించిచూడ దుర్గాదేవిమ్రోల యిటుక లూడిన గోడయందు జిరకాలము క్రిందట జచ్చి శల్యావశిష్టమైయున్న పన్నగశిరమున వెలుగు దివ్యరత్నము గాన్పించెను. అప్పుడు నేను విస్మయమందుచు నౌరా ! ఈ చండికాయతన మంతయు శూన్యముగా నున్నదేమి? బాగు బాగు. ఈ భుజగమణియే దీపభ్రాంతి గొల్పి నన్నిందు జేర్చెను. ఇందు నేను కరచరణముఖంబులం గడిగికొని యాచమనం బొనర్చి శుచినై యీయమ్మవారికి నమస్కరించెదంగాక యని యిటునటు బరికింప ముం దొక యల్పవిరసాంబువులతో బాడుపడియున్న పుష్కరిణి గనుపింప నందు విధ్యుక్తధర్మంబుల నిర్వర్తించి సత్వరమ యా దుర్గాదేవి సన్నిధికరిగి “జయ జయ త్రిభువన జనాప్యాయినీ కాత్యాయనీ” యని భక్తిప్రయుక్తవచనంబుల నిట్లని స్తుతించితిని.


శ్లో. స్వామిన్యార్యే భుజంగాభరణవలయిని స్థూలశూలాస్త్రదండే
    చాముండే చండి చంచన్ని భిడనరశిరఃస్రక్పరీతాంగి దుర్గే
    దేవి స్వర్నాధచూనామణికిరణకణ శ్రేణిధౌతాగ్రపాద
    ద్వంద్వే పంద్యేభినంద్యే జనని జయజయ శ్రీమహాకాళిదివ్వే.

ఇట్లు స్తుతించి యా యమ్మవారికి సాష్టాంగ నమస్కారం బొనరించి లేచి యన్యపధికజననోసిలబ్ది నపేక్షించుచు బహిర్మండపమున కేగితిని. అందుగూడ నెవ్వ రును లేరు. లోనఁ బ్రతిష్టింపబడియున్న క్షేత్రపాలక విగ్రహముంగాంచి యిట్లని స్తుతించిరి.


శ్లో. ధృత్యావేశ ప్రసక్తైర్జ్వలదనలను ఖోమ్మక్త ఫేత్కార ఘోరైః
    ములై రుత్తాంతాళ వ్యతికరముఖరీభూతభూషాస్థిమాలైః