పుట:కాశీమజిలీకథలు-12.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

బోగొట్టుకొనిరి. సామంతలోక మెల్ల నావలన నిర్భంధింపబడి యపారమగు సిరికి దూర మయ్యెను. ఇంక నే నెచ్చటనుండి ద్రవ్యమును దేగలను ? ద్యూత క్రీడావినోదమహా భాగ్యం బెట్లనుభవింపగలను? ద్రవ్యోపార్జనమునకు నూతనమార్గ మెద్ది గలదు ? మహా ర్ణవమందు వివిధ రత్నజాతులు సంభవించునందురు.

మరియు రోహణాచలము మృణిమృద్ధమని వచింతురు ఛీ ! అగస్త్యునిచే గ్రక్కబడిన సముద్రమందలి రత్నములు నా కెట్లు స్పృశింపనర్హ ములగును? రోహణా చల గర్భమున రత్నముల నిక్షేపించుకొని దానిమీ‌ద గూర్చునియున్న యా గృపణుని ధనము నా కెట్లు పనికివచ్చును ? లేకున్న మదీయభుజబలమున రోహణగేంద్రమును మధింపకుందునా‌ ? ప్రతిపానలమున సముద్రము నింకింపకుందునా ? అభిమతార్థ సిద్ధికి వీరుల కసాధ్య మేమి గలదు ? ఇక ధనసమార్జనమునకు మరొక్కమార్గ మేది గలదు ! బాగు. బాగు. చక్కగా జ్ఞప్తికి వచ్చినది. సకలసువర్ణమణిమయాగార పరి కరములచే నొప్పుచు రాక్షసులకు నివాసమైన లంకాపట్టణమున్నది గదా? దానిని పూర్వము స్త్రీ హృదయుండగు రాముడే సాధించియుండ నశేషభువనైక వీరుండనగు నేను మాత్రమిప్పుడు జయింపజాలనా ? కావున నేనడకేగి యా పురమును హఠాత్తుగా నాక్రమించి యందున్న సువర్ణశిలాసంభారంబెల్ల సంగ్రహించి కుబేరుని నాటినుండి యును సంపాదింపబడి ధనాగారమున దాచియుంచిన విభీషణుని ధనమెల్ల గొల్లకొని దానిని నాకు వంగి నమస్కరించు రాక్షసులమూపులం బెట్టి యిందు దెప్పించెదగాక. అప్పుడుగాని ద్యూతవ్యసనమందు నామనమున కానందము గలుగనేరదని నిశ్చయించు కొని దిగంయాత్రోచిత సమయం బపేక్షింపక ముందువెనుక లరయక ద్యూతకార్యా వస్థిత హృదయుండనై వలయు పరికరముల స్వీకరించి నాటి మధ్యాహ్నము గడచిన పిమ్మట నితరు లెవ్వరికిని దెలియకుండ నేకాకినై యిల్లు వెడలిపోతిని.

అట్లు గృహప్రతోళీద్వారమున నిర్గమించి యిట్లని తలంచితిని జౌరా ! నే నిట్లు ప్రయాణపరికరములతో బోవుట యెవడయిన జూచెనేని నా జననీ జనకుల తోడను‌ బంధుజనులతోడను జెప్పకమానడు. దేశాంతర మరుగుచుండుట దెలిసిన తోడనే వారు నా కడ్డుగాక మానరు. లేకున్న నా వెనువెంట నెవ్వరినైన సహాయము బంపకుండలేరు. దాన నా కనేకములగు నంతరాయములు గలుగఁ గలవు. కావున నొరు లెవ్వరికంట బడకుండ జనపదమునకు జేరువదారిని బరిత్యజించి పోయెదం గాక యని నిశ్చయించి యతిత్వరితగమనమున బురపరిసరం బతిక్రమించి దక్షిణదిశ కేగు మార్గమునంబడి నడచుచు సూర్యాస్తమయ సమయమునకు యోజనశక్తిక యను గ్రామమును జేరుకొంటిని.

ఆ పురము జేరినతోడనే యెదుర గనంబడిన యూరచెరువునందు సామంతన సంధ్యా విధుల నిర్వర్తించుకొని యప్పటికే చిమ్మచీకటిచే నావృతమైయున్న యా గ్రామములోని కరిగి యితరులెవ్వరు జూడకుండ నాకు బూర్వపరిచితుండగు పిప్పల