పుట:కాశీమజిలీకథలు-12.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రపటము కథ

161


    క్రమితమునై, మనోజవిభుగాత్రనిగుప్తి దనుత్రమై, మనోజ్ఞ
    మయిన నీ స్వరూపము భృశం బెవఁడిట్లు లిఖింపగల్గెనో !

మరియును-

గీ. అమరహిమధామునందున్న యమృతరసము
    పొంగిపడ దానిఁ బటమందుఁ బూసి పుష్ప
    బాణుఁడు నిజేషుతూలిక వ్రాసె దీనిఁ
    గానిచో నింతసుఖ మెట్లు గనఁగఁ గలుగు ?

ఇట్లు గాకున్న నీ చిత్రము వజ్రులేపమున లిఖింపబడియుండవలెను. కావు ననే యీ చిత్రస్వరూపమున దృఢముగ దగుల్కొన్న నాదృష్టులయందుండి మరలు టకు సమర్థములు గాకున్నవి. ఈ మోహనాంగిరూపమున మన్మధరాజ్యచక్రవర్తి లక్ష ణములు నియమితములై యున్నవి. ఈమె విమల లలాటపట్టిక పైన నలుపురంగుతో లిఖింపబడిన ముంగురులు రూపవతులగు యోషిల్లలామల దర్పజ్వరాపహారకములగు మంత్రాక్షరశ్రేణులవలె నొప్పుచున్నవి. మరెయును దీనిం దిలకించిన పురుషులకు మనోవికారము గలుగునని వెరచియే రతీదేవి మన్మధునితోగూడి సర్వత్ర పరిభ్రమించు చున్నది. రోహిణి యరుంధతులు శశివష్టుల నుదయాస్తమయములనై నను విడువక పార్శ్వముల నుండిరి. లక్ష్మి విష్ణువక్షస్థలమున సంతతము నిలచియున్నది. శచీదేవి యనిమిషదృష్టుల నింద్రుని నెల్లప్పు డీక్షించుచు వాని బాయకున్నది. గౌరీసతిగూడ యంధకరిపుని యర్ధాంగమున గలసియున్నది. ఇట్టి యసమానరూపలావణ్యముల నొప్పియున్న యీరమణీమణి నేమని వర్ణింపగలనని తలంచుచు నత్యంతకౌతుకావేశ హృదయసరోజాతుడై యాభూపతి శుభస్వరూపమును విడిచివచ్చిన పురుషపుంగవు నుపలక్షించి యిట్లనియె.

మహాత్మా ! నీవెవ్వడవో నే నెరుంగనైతిని. నీకులమెయ్యది? కమనీయమగు నీ నామధేయ మెయ్యది? జన్మదేశ‌ మెయ్యది? ఎవని సన్నిధిని విద్యాభ్యాస మొనరించి తివి? ఈ చిత్రఫలకమునందు లిఖింపబడిన యువతి యెచ్చటనున్నది? ఈ ప్రకృతి నీకెట్లు లభించినది? ఎందుకొర కిట్లు చిత్రమున నీయువతీలలామ వ్రాయబడి యుండెను? నీవు శుకశకుంతభావము నెట్లుపొందితివి ? దేనివలన నీకు తిరిగి నిజస్వరూప లాభము సంప్రాప్తమయ్యెను? ఇట్లు ప్రశ్నించు పుండరీకుని కానూత్న పురుషుం డిట్లనియె.

స్వామీ ! అత్యంత కుతూహలమును గలిగించు నావృత్తాంతమెల్ల సవిస్త రముగ విన్నవించుకొందునని పలుకుచుండగనే సముచితార్థవేదియగు వసంతశీలుఁ డమ్మహారాజున కిట్లనియె. దేవా ! నవరసామేషంగమగు నీవృత్తాంత మాస్థానప్రదేశ మున విని నిర్హంబగును. ఇచ్చట పరిజనులు ప్రతీహారహుంకృతుల మౌనము వహించి