పుట:కాశీమజిలీకథలు-12.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    యీ చక్కిన్‌ గఠినాత్మ దీనిఁగనరారే ? యీ ఫలంబీయఁగా
    యాచింపగ మదుక్తికుత్తరము నీయన్‌జూడ దొక్కింతయున్‌.

ఆ మాట లాలించి నల్దెసల దృష్టుల బ్రసరించుచు వసంతశీలు నుద్దేశించి, ఓహో ! ఇచ్చట నెవ్వడో యవధీరితప్రియుండై చెలిమి కత్తియలతో నుపాలంభ పూర్వకంబుగ నిట్లు పలుకుచున్నాడు కాబోలునని వంచించు నా నృపసత్తమునితో వసంతశీలుండు మందస్మితంబున నిట్లనియె. స్వామీ ! ఇచ్చట నెవ్వడును బ్రియు రాలిచే దిరస్కృతుండైనవాడు లేడు. చెలికత్తెలతో జెప్పుకొనువాడును నిందులేడు అయ్యవి దేవరవారిమనంబున కనవరతంబు వినోదమొనగూర్చు చిత్రశిఖుని చిలుక పలుకులు నేడిందు విచ్చేసిన ప్రభుసేవావ్యగ్ర హృదయుండనై యా చిలుక కాహార మొసంగుట మఱచితిని. కావున నయ్యది క్షుదాంధీభూత చేతస్కయై యమ్మణి మండ పమునందు మరకత స్తంభాంతరి పంజరమునుండి యందుగల వజ్రోపలసాలభంజి కాకరమున నున్న కమలరాగ దాడిమీఫలంబు గని నిజమైనదానిగా నమ్మి యెంత బ్రార్దించినను దాని నొసంగకుండుటచే మిగుల వగచుచు నందందు గల వివిధమజెణి పుత్రికల జెలువలనిభ్రమించి తనకోర్కె వారికి దెలుపుచు నాక్రోశించుచుండెనని విన్న వించెను.

ఆ మాటలు విని యా భూజాని మిగుల నక్కజంపడుచు నౌరా ! సకల తత్వావబోధబుద్ధి గలిగిన యా చిత్రశిఖుని చైతన్యము కృత్రిమ ఫలాభిలాషచే నిట్లు తారుమారయ్యె నేమి చెపుమా ? మందబుద్ధియై వీడు ముందెట్లు ప్రవర్తించునో చూచె దముగాక యని పలికి యా నరేంద్రుండావంక దిలకించుచుండెను.

అప్పుడా చిలుక తన యభిలాష దీర్చుకొన నుద్యమించి మిగుల రొద సేయుచు దృఢచంచూపుటంబున నా పంజర ద్వారంబున కమర్పబడిన విద్రుమ శలాకల మాటిమాటికి నాకర్షించుచు గట్టిగా బొడుచుటచే నా కవాటము భగ్నమైనది. దాన నేర్పడిన మార్గంబున నయ్యది బైటకేతెంచి యతిరయంబున సింహాసనస్థానవేదికపై కెక్కి సమీపమందలి రత్నపుత్రికావాస్తంగతమైయున్న పద్మరాగ దాడి మీ ఫలం బును ముక్కుతో దీవ్రముగా బొడువ దొడంగెను. దృడమణి శిలాస్పాలనంబున దాని చంచువు విగ్యళితమయ్యెను. చంచుభంగమైనతోడనే చిత్రశిఖుండు శుకశకుంతస్వరూ పంబు విడచి కరకర బాహుండును, నాయతభుజుండును, పరిఘవక్షస్థలుండును, విశాలలలాటుండును, నష్టాదశవర్ష ప్రాయుడునునైన పురుషపుంగవుడయ్యెను.

ఆ యద్భుత దృశ్యమును జూచుచున్న పుండరీక రాజేంద్రు డత్యంతా శ్చర్య సావేశ హృదయుండై యేమేమి ! ఈ వింత ! ఇంతలో నీ చిత్రశిఖుం డేమయ్యెనని సంభ్రమంబున పలుకుచు బార్శ్వ వర్తులతో నా వంక జూచుచుండెమ. ఇంతలో నందున్న పురుషుండు తన శుకశరీరమునుండి జారి యా ప్రదేశమందు బడి యున్న‌ దాని నెద్దియో గ్రహించి చేతియందు చుట్టగా బట్టుకొని యున్న యొక